ఐదు భాషల్లో ‘సచిన్‌’ సినిమా | Sakshi
Sakshi News home page

ఐదు భాషల్లో ‘సచిన్‌’ సినిమా

Published Fri, May 5 2017 10:44 PM

ఐదు భాషల్లో ‘సచిన్‌’ సినిమా

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్క ర్‌ జీవిత చరిత్రపై వస్తున్న డాక్యుమెంటరీ డ్రామా ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ను ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈనెల 26న విడుదలయ్యే ఈ సినిమాను దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులందరినీ అలరించేందుకు హిందీ, ఇంగ్లిష్, మరాఠి, తమిళ్, తెలుగు భాషల్లో అందిస్తున్నట్టు నిర్మాత రవి భాగ్‌చండ్క తెలిపారు.

‘సచిన్‌ టెండూల్కర్‌ కీర్తిని ఏ ఒక్క భాషకో పరిమితం చేయలేము. దేశం గర్వించదగ్గ వ్యక్తి కాబట్టి వీలైనన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నాం’ అని రవి చెప్పారు. సచిన్‌ చిన్నతనం నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగి సాధించిన కీర్తి ప్రతిష్టల సమాహారంగా ఈ డాక్యుమెంటరీని చెప్పుకోవచ్చు.

Advertisement
Advertisement