చిన్నారులకు ఫుట్‌బాల్‌లో కోచింగ్

3 Apr, 2014 23:57 IST|Sakshi

శిక్షణ ఇవ్వనున్న ప్రముఖ కోచ్ గ్యారీ
 రాయదుర్గం, న్యూస్‌లైన్: చిన్నారులకు ఫుట్‌బాల్ క్రీడపై ఆసక్తి పెంచి వారిని ఆటలో తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొం దిస్తున్నట్లు ప్రముఖ కోచ్ గ్యారీ గయాన్ అన్నారు. శేరిలింగంప్లలి ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో ఆయన గురువారం ఆటగాళ్లతో ముచ్చటించారు. ఆర్సనల్ ప్యాకర్ స్కూల్ ఇండియా, ఇండియా ఆన్ ట్రాక్‌తో కలిసి గయాన్ ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి వివరాలను గ్యారీ వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు వేర్వేరు నగరాల్లో కూడా విద్యార్థులకు కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.
 
  మన దేశంలో ఫుట్‌బాల్‌కు అంతగా ఆదరణ లేదని, అయితే ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే జాతీయ జట్టుకు ఆడగలిగే మెరికల్లాంటి ప్లేయర్లు తయారవుతారని గ్యారీ ఆశాభావం వ్యక్తం చేశారు.  మొదటి విడత శిక్షణా కార్యక్రమాలను ఖాజాగూడ న్యూటన్ క్యాంపస్‌లో మే 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు, రెండవ విడత బాచుపల్లి క్యాంపస్‌లో మే 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.
 
 ఈ శిక్షణలో ఒక్కో బ్యాచ్‌లో 32 మంది విద్యార్థులకు మాత్రమే శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ ప్రారంభించడానికి ముందు 48 గంటల ముందే తమ పేర్లను న మోదు చేసుకోవాలని కోరారు. ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలతోపాటు నగరంలోని ఇతర పాఠశాలల విద్యార్థులు కూడా చేరడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓక్రిడ్జ్ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ బిజు బేబి, ఇండియా ఆన్ ట్రాక్ సంస్థ ప్రతినిధులు రషమ్ శర్మ, వరుణ్, ఓక్రిడ్జ్ పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ హెడ్ డేవిడ్ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు