గౌతం గంభీర్ కు షాక్! | Sakshi
Sakshi News home page

గౌతం గంభీర్ కు షాక్!

Published Sat, Jun 17 2017 7:26 PM

గౌతం గంభీర్ కు షాక్!

న్యూఢిల్లీ:భారత వెటరన్ ఓపెనర్ గౌతం గంభీర్ కు షాక్ తగిలింది. కొన్ని నెలల క్రితం ఢిల్లీ కోచ్ క్రిష్ణన్ భాస్కరన్ పిళ్లైతో చోటు చేసుకున్న వివాదంలో గంభీర్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  భాస్కరన్ ను తీవ్రంగా దూషించినట్లు ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీసీ) ఏర్పాటు చేసిన ముగ్గురు కమిటీ సభ్యుల బృందం తేల్చడంతో గంభీర్ పై నాలుగు మ్యాచ్ల నిషేధం పడింది. ఈ మేరకు గంభీర్ తప్పుచేసినట్లు భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్, రాజేందర్ ఎస్ రాథోడ్, సోనీ సింగ్లతో కూడిన కమిటీ శనివారం నివేదిక అందజేసింది. దాంతో గంభీర్ పై నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు నిషేధం విధిస్తున్నట్లు  డీడీసీసీ స్పష్టం చేసింది.

ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా ఢిల్లీ ఓపెనర్ గౌతం గంభీర్, కోచ్ క్రిష్ణన్ భాస్కరన్ పిళ్లై మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ట్రోఫీలో ఢిల్లీ పోరాటం ముగిసిన తరువాత తనను గంభీర్ తీవ్రంగా దూషించినట్లు బాస్కరన్ అనేకసార్లు మీడియా ముందు వాపోయాడు. తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ గంభీర్ అగౌరపరిచాడని భాస్కరన్ తెలిపాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన డీడీసీఏ.. ఆ ఘటనపై విచారణకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేసింది.

దానిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టిన మదన్ లాల్ నేతృత్వంలోని కమిటీ.. గంభీర్ తప్పుచేసినట్లు తేల్చింది. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం కాబట్టి గంభీర్ పై నాలుగు మ్యాచ్ లు నిషేధం విధిస్తున్నట్లు డీడీసీఏ పరిపాలకుడు  విక్రమ్జిత్ సేన్ తెలిపారు. ఈ వివాదంలో తొలుత గంభీర్ కు రెండేళ్ల పాటు నిషేధం విధించాలని విక్రమ్ జిత్ సేన్ భావించారు. అయితే ఇక ముందు ఎటువంటి తప్పు చేయనని గంభీర్ తెలపడంతో అతని శిక్షా కాలాన్ని మ్యాచ్ ల వరకూ మాత్రమే పరిమితం చేసినట్లు సేన్ తెలిపారు.

Advertisement
Advertisement