ఫస్ట్ ఎంఎస్ ధోనీ.. సెకండ్ గంభీర్.. | Sakshi
Sakshi News home page

ఫస్ట్ ఎంఎస్ ధోనీ.. సెకండ్ గంభీర్..

Published Sat, Apr 8 2017 11:01 AM

ఫస్ట్ ఎంఎస్ ధోనీ.. సెకండ్ గంభీర్..

రాజ్‌కోట: గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో సాధించిన హాఫ్ సెంచరీతో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా సన్ రైజర్స్ హైదారాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేశాడు. గతంలో 32 హాఫ్ సెంచరీలతో వార్నర్ టాప్ పొజిషన్ లో ఉండగా.. గుజరాత్ పై మ్యాచ్ లో గంభీర్‌ అజేయ హాఫ్ సెంచరీ (48 బంతుల్లో 76 నాటౌట్‌; 12 ఫోర్లు) చేసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో 3000 పరుగులు పూర్తి చేసిన రెండో కెప్టెన్‌గా గంభీర్ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి 8 సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుగా కెప్టెన్ గా వ్యవహరించిన ఎంఎస్ ధోనీ ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు. ధోనీ తర్వాత ఈ ఫీట్ నమోదు చేసిన కెప్టెన్ గా గంభీర్ నిలిచాడు.

ఈ మ్యాచ్ కోల్‌కతా మరో ఓపెనర్ క్రిస్ లిన్ (93 నాటౌట్) కూడా చెలరేగడంతో పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఓపెనర్లు గంభీర్, క్రిస్ లిన్ ఔట్ కాకుండా 184 పరుగుల లక్ష్యాన్ని చేరడంతో టీ20ల్లో వికెట్ కోల్పోకుండా అత్యధిక పరుగులు చేసిన జట్టుగా కేకేఆర్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అయితే సిక్స్ కొట్టకుండా అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాళ్లలో గంభీర్ (76 నాటౌట్) రెండో స్థానంలో నిలిచాడు. గతంలో 75 పరుగులతో రైనా ఈ స్థానంలో ఉన్నాడు. 2013లో మన్ దీప్ 77 పరుగులతో నాటౌట్ గా నిలిచినా సిక్స్ కొట్టలేదు. సిక్స్ లేకుండానే అత్యధిక వ్యక్తిగత పరుగులలో ఓవరాల్ గా మన్ దీప్ తొలి స్థానంలో ఉన్నాడు.

Advertisement
Advertisement