అమెరికాలో గావస్కర్‌ గ్రౌండ్‌ | Sakshi
Sakshi News home page

అమెరికాలో గావస్కర్‌ గ్రౌండ్‌

Published Fri, Oct 27 2017 12:50 AM

Gavaskar ground in America - Sakshi

ముంబై: భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ పేరిట అమెరికాలో ఓ క్రికెట్‌ గ్రౌండ్‌ రూపుదిద్దుకుంది. కెంటకీ రాష్ట్రంలోని లూయిస్‌ విల్లేలో కొత్తగా నిర్మించిన ఈ మైదానాన్ని స్వయంగా గావస్కరే ప్రారంభించడం మరో విశేషం. ఇటీవలే జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లూయిస్‌ విల్లే మేయర్‌ గ్రెగ్‌ ఫిష్చెర్‌ పాల్గొన్నారు. 42 జట్లు తలపడే ‘మిడ్‌వెస్ట్‌ క్రికెట్‌ లీగ్‌’లో ఈ గావస్కర్‌ మైదానం లూయిస్‌ విల్లే క్రికెట్‌ క్లబ్‌కు హోమ్‌ గ్రౌండ్‌గా ఉపయోగపడుతుంది.

అమెరికాలో తన పేరిట ఓ గ్రౌండ్‌ ఉండటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు సన్నీ చెప్పారు. ‘ఇది నాకు దక్కిన విశిష్ట గౌరవం. క్రికెట్‌కు ప్రాధాన్యతలేని ఓ దేశంలో నా పేరుతో గ్రౌండ్‌  ఏర్పాటు చేయడం చాలా సంతోషాన్నిచ్చింది’ అని అన్నారు.  

Advertisement
Advertisement