క్వార్టర్స్‌లో గేల్ ఆడతాడు | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో గేల్ ఆడతాడు

Published Tue, Mar 17 2015 1:23 AM

క్వార్టర్స్‌లో గేల్ ఆడతాడు

వెస్టిండీస్ కెప్టెన్ ధీమా
 వెల్లింగ్టన్: వెస్టిండీస్ జట్టు ఆడిన ఆఖరి లీగ్ మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్... న్యూజిలాండ్‌తో శనివారం జరిగే క్వార్టర్ ఫైనల్ నాటికి పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటాడని ఆ జట్టు కెప్టెన్ హోల్డర్ ధీమా వ్యక్తం చేశాడు. ‘అది మాకు చాలా ముఖ్యమైన మ్యాచ్. ఒకవేళ గేల్ వందశాతం ఫిట్‌నెస్‌తో లేకపోయినా ఆ మ్యాచ్‌కు అందుబాటులో ఉం టాడు. గేల్ జట్టులో ఉంటే ఏ ప్రత్యర్థి అయినా జాగ్రత్తగా ఆడాల్సిందే’ అని హోల్డర్ అన్నాడు.

Advertisement
Advertisement