మ్యాక్స్‌వెల్... ఇప్పుడేమంటావ్! | Sakshi
Sakshi News home page

మ్యాక్స్‌వెల్... ఇప్పుడేమంటావ్!

Published Tue, Mar 3 2015 12:30 AM

మ్యాక్స్‌వెల్... ఇప్పుడేమంటావ్!

సిడ్నీ: న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత వన్డేలో ఆస్ట్రేలియా పరాజయం పాలైన విషయం తెలిసిందే. కివీస్ ఇన్నింగ్స్ చివర్లో కేన్ విలియమ్సన్ భారీ సిక్స్‌తో జట్టు గట్టెక్కింది. అయితే ఈ షాట్‌కు ముందు డీప్ మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేసిన ఆసీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ చేసిన సంజ్ఞ ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

ఈడెన్ పార్క్‌లోని ప్రేక్షకుల వైపు తిరిగి ఆతిథ్య (కివీస్) జట్టు ఓడిపోతోందని సూచిస్తూ తన రెండు చేతులను సరదాగా గొంతు చుట్టూ బిగించి చూపాడు. కానీ వెంటనే దీనికి సమాధానంగా అన్నట్టు విలియమ్సన్ భారీ షాట్ ఆడి గెలిపించాడు. దీంతో అభిమానులు మ్యాక్స్‌ను గేలి చేశారు. ఈ సన్నివేశాన ్నంతా సాన్ హోల్ట్ అనే కివీస్ అభిమాని వీడియో తీసి సోమవారం ఫేస్‌బుక్‌లో ఉంచాడు. ఇప్పుడేమంటావ్ మ్యాక్స్‌వెల్ అని కివీస్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement