వీర విహారి | Sakshi
Sakshi News home page

వీర విహారి

Published Mon, Mar 5 2018 4:43 AM

Hanuma Vihari blitz leaves India-A dazed - Sakshi

ధర్మశాల: దేవధర్‌ ట్రోఫీ వన్డే టోర్నీలో భారత్‌ ‘బి’ శుభారంభం చేసింది. ఆంధ్ర బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి (76 బంతుల్లో 95 నాటౌట్‌; 16 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగడంతో భారత్‌ ‘బి’ జట్టు 8 వికెట్లతో భారత్‌ ‘ఎ’పై నెగ్గింది. మొదట భారత్‌ ‘ఎ’ 41.2 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌటైంది. ‘ఎ’ జట్టు స్కోరు 51/4 వద్ద ఉన్నపుడు వర్షంతో ఆటకు అంతరాయం కలిగింది.

దీంతో మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. ‘ఎ’ జట్టులోనూ ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్‌ (107 బంతుల్లో 78; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ధర్మేంద్ర సింగ్‌ జడేజా 4, ఉమేశ్‌ యాదవ్, జయంత్‌ యాదవ్, సిద్ధార్థ్‌ కౌల్‌ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్‌ ‘బి’ లక్ష్యాన్ని 43 ఓవర్లలో 175 పరుగులుగా నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని ఆ జట్టు 26.2 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఈశ్వరన్‌ (43), కెప్టెన్‌ అయ్యర్‌ (28 నాటౌట్‌) మెరుగ్గా ఆడారు. నేడు జరిగే పోరులో భారత్‌ ‘బి’తో విజయ్‌ హజారే ట్రోఫీ విజేత కర్ణాటక జట్టు తలపడుతుంది. 

Advertisement
Advertisement