యువరాజ్‌ పెళ్లిలో ఇలా డాన్స్‌ ఇరగదీస్తా | Sakshi
Sakshi News home page

యువరాజ్‌ పెళ్లిలో ఇలా డాన్స్‌ ఇరగదీస్తా

Published Mon, Nov 7 2016 1:49 PM

యువరాజ్‌ పెళ్లిలో ఇలా డాన్స్‌ ఇరగదీస్తా - Sakshi

భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ మంచి స్నేహితులు. వీరిద్దరూ టీమిండియాతో పాటు పంజాబ్‌ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. యువరాజ్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నందుకు హర్భజన్‌కు సంతోషంగా ఉంది. యువీ పెళ్లిలో డాన్స్ అదరగొడతానని చెప్పాడు. ఎలా డాన్స్ చేయాలని భావిస్తున్నాడో చెబుతూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో చిన్న పిల్లలు మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. 

గతేడాది హర్భజన్‌ నటి గీతా బస్రాను పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ జట్టుతో పంజాబ్‌ తరఫున యువీ రంజీ మ్యాచ్ ఆడాల్సివుంది. అయితే యువీ మ్యాచ్ ఎగ్గొట్టి మరీ భజ్జీ వివాహ రిసెప్షన్కు హాజరై సందడి చేశాడు. ఇప్పుడు యువీ పెళ్లిలో భజ్జీ హంగామా చేయబోతున్నాడు. డిసెంబర్లో యువరాజ్‌.. నటి హచల్‌ కీచ్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. యువరాజ్ వెరైటీగా తయారు చేయించిన శుభలేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Advertisement
Advertisement