‘మనకు సేవ చేసే వారిపై దాడులా’ | Sakshi
Sakshi News home page

‘మనకు సేవ చేసే వారిపై దాడులా’

Published Fri, Apr 3 2020 8:43 PM

Hima Das, Mirabai Urge People To Follow Coronavirus Lockdown - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దానిని నివారించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రంగాల ప్రముఖులతో సమాలోచనలు జరుపుతున్నారు. దీనిలో భాగంగా వివిధ క్రీడలకు సంబంధించిన పలువురితో శుక్రవారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇందులో సచిన్‌, సౌరవ్‌ గంగూలీ, కోహ్లి వంటి క్రికెటర్లతో పాటు స్ప్రింటర్‌ హిమదాస్‌, వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానులు కూడా ఉన్నారు. (40 మంది క్రీడా ‍ప్రముఖులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌)

ప్ర‌ధానితో వీడియో స‌మావేశం అనంత‌రం హిమదాస్‌ మాట్లాడుతూ..  లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌జ‌లంతా ఇండ్ల‌కే ప‌రిమితం కావాల‌ని పిలుపునిచ్చారు. ‘క్రీడాకారులకు ప్రస్తుత పరిస్థితిని వివరించి  మాతో మాట్లాడినందుకు తొలుత ప్రధానమంత్రికి కృతజ్ఞతలు. క‌ష్ట‌కాలంలో సేవ‌లందిస్తున్న సిబ్బందిపై దాడులు జ‌రుగ‌డం చూస్తుంటే చాలా బాధేస్తుంది. మనకు సేవ చేసే వారిపై దాడులా.. డాక్ట‌ర్లు, పోలీసుల‌పై రాళ్లు రువ్వ‌డం ఎంత మాత్రం సరైంది కాదు’ అని పేర్కొన్నారు. ఇక మీరాబాయి చాను కూడా మాట్లాడుతూ.. ‘ లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ నిబంధనలను పాటించాలి. సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. (ముందు నువ్వుండాలి.. ఆ తర్వాతే ఐపీఎల్‌: రైనా)

ప్ర‌ముఖ వెయిట్ లిఫ్ట‌ర్ మీరాబాయి చాను మాట్లాడుతూ.. `లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను పాటించాల్సిన అవ‌స‌రముంది. సామాజిక దూరం పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి` అని చెప్పారు. ఏప్రిల్‌ 5 వ తేదీన రాత్రి 9 గంటలకు ఇంట్లో క్యాండిల్‌, దీపాలు వెలిగించి కానీ ఫ్లాష్‌ లైట్‌తో కానీ తొమ్మిది నిమిషాల పాటు కరోనాపై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం  తెలపాలని చెప్పినట్లు మీరాబాయి చాను తెలిపారు. ఇక ఇంట్లో ఉంటూ ఎంజాయ్‌ చేయమని కూడా మోదీ చెప్పారన్నారు. ఇదే విషయాన్ని తాను ప్రజలకు తెలియజేస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ప్రధాని పిలుపు మేరకు ప్రతీ ఒక‍్కరూ కరోనాపై పోరాటంలో మమేకం కావాలన్నారు. 

Advertisement
Advertisement