సచిన్తో పోల్చడం ఆపండి! | Sakshi
Sakshi News home page

సచిన్తో పోల్చడం ఆపండి!

Published Mon, Jul 11 2016 6:44 PM

సచిన్తో పోల్చడం ఆపండి!

బసెటెర్రె (సెయింట్ కిట్స్): పరుగుల యంత్రాన్ని తలపిస్తూ ఇప్పటికే పలు ఘనతలను తన ఖాతాలో వేసుకున్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్పై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. ఆ దిగ్గజ ఆటగాడితో తనను దయచేసి పోల్చవద్దంటూ అభిమానులకు మరోమారు విజ్ఞప్తి చేశాడు. అసలు తనకు సచిన్తో ఎటువంటి పోలికా లేదని విరాట్  తెలిపాడు.  సచిన్తో తనను పోల్చే విషయాన్ని ఇకనుంచైనా ఆపాలని విజ్ఞప్తి చేశాడు. ఈ విషయంలో అభిమానులు, మీడియా కాస్త సంయమనం పాటించాలని సూచించాడు.

'అసలు సచిన్తో నాకు పోలిక లేదు. అతనితో నన్ను ఎందుకు పోల్చుతున్నారో అర్థం కావడం లేదు. సచిన్ ఆడినన్ని రోజులు ప్రజలకు అతనొక ఆదర్శం. ఆ రకమైన ఘనతను సాధించానని నేను అనుకోవడం లేదు. టెండూల్కర్ చాలా మందికి ప్రేరణగా నిలిచాడు.. మానవతా కోణంలో కూడా సచిన్ కు నేను ఏమాత్రం సరిపోను'అని విరాట్ తెలిపాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement