హంపి, హారికలకు మిశ్రమ ఫలితాలు | Sakshi
Sakshi News home page

హంపి, హారికలకు మిశ్రమ ఫలితాలు

Published Mon, Dec 26 2016 11:57 PM

హంపి, హారికలకు మిశ్రమ ఫలితాలు

దోహా: ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు తొలిరోజు మిశ్రమ ఫలితాలు లభించాయి. నాలుగో రౌండ్‌ ముగిసిన తర్వాత హంపి 2.5 పాయింట్లు, హారిక 2 పాయింట్లు సాధించారు.

హంపి రెండు గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయింది. హారిక ఒక గేమ్‌లో గెలిచి, మరో గేమ్‌లో ఓడి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. ఓపెన్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఎం.ఆర్‌.లలిత్‌ బాబు రెండు గేముల్లో ఓడి, మరో రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు.  

Advertisement
Advertisement