హైదరాబాద్ శుభారంభం | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ శుభారంభం

Published Mon, Jan 30 2017 10:52 AM

హైదరాబాద్ శుభారంభం - Sakshi

ముస్తాక్ అలీ టి20 క్రికెట్ టోర్నీ  



చెన్నై: సయ్యద్ ముస్తాక్ అలీ అంతర్రాష్ట్ర టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు బ్యాట్స్‌మన్ తన్మయ్ అగర్వాల్ (48 బంతుల్లో 91; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించాడు. దీంతో గోవా జట్టుతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 51 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లనష్టానికి 224 పరుగుల భారీ స్కోరు చేసింది. అక్షత్ రెడ్డి (32 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగగా... బద్రీనాథ్ (22 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లలో సౌరభ్, అమిత్, గణేశ్‌రాజ్ తలో వికెట్ తీశారు. అనంతరం గోవా జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసి ఓడిపోయింది. షగుణ్ కామత్ (44 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సౌరభ్ (25 బంతుల్లో 53; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) పోరాడారు. హైదరాబాద్ బౌలర్లలో సిరాజ్, టి. రవితేజ, ఆకాశ్ భండారి, మెహదీ హసన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
 
 ఓపెనర్ల జోరు
 
 హైదరాబాద్ ఓపెనర్లు తన్మయ్, అక్షత్ రెడ్డి ధాటిగా ఇన్నింగ్‌‌సను ఆరంభించారు. వీరిద్దరూ ఫోర్లతో, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగుపెట్టించారు. అక్షత్ క్రీజులో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకోగా... తన్మయ్ ఆరంభం నుంచే గోవా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో తన్మయ్ టి20లో తొలి అర్ధసెంచరీని నమోదు చేశాడు. వీరిద్దరూ ధాటిగా ఆడుతూ తొలి వికెట్‌కు 111 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అక్షత్ 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మిషాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన బద్రీనాథ్ (49), తన్మయ్‌కి చక్కని సహకారం అందించాడు. ఈ జంట ఆరు ఓవర్ల పాటు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొని రెండో వికెట్‌కు 87 పరుగుల్ని జోడించింది. తన్మయ్ 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సౌరభ్ బౌలింగ్‌లో రితురాజ్ సింగ్‌కు క్యాచ్ ఇవ్వడంతో గోవా ఊపిరి పీల్చుకుంది. మరో మూడు బంతుల వ్యవధిలోనే బద్రీనాథ్ రనౌట్‌గా పెవిలియన్ చేరాడు.  ఆ తర్వాత రవితేజ (3) నిరాశపరిచాడు. అనిరుధ్ (9 నాటౌట్), సుమంత్ (12 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
 
 రాణించిన షగుణ్, సౌరభ్
 
 భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన గోవా నెమ్మదిగా ఇన్నింగ్‌‌సను ఆరంభించింది. షగుణ్ కామత్ (50) ఆచితూచి పరుగులు చేయగా... స్వప్నిల్ అస్నోద్కర్ (19) త్వరగానే పెవిలియన్‌కు చేరాడు. స్నేహల్ కౌథాంకర్ (2) మరో నాలుగు పరుగుల వ్యవధిలోనే ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మిషాల్ (25) కామత్‌కు చక్కగా సహకరించాడు. ఈ జంట మూడో వికెట్‌కు 70 పరుగుల జోడించాక భండారి బౌలింగ్‌లో కామత్ వెనుదిరిగాడు. వెంటనే విషాల్ కూడా పెవిలియన్ బాట పట్టగా, కీనన్ వాజ్ (9) రాణించలేకపోయాడు. చివర్లో సౌరభ్ బండేకర్ (53 నాటౌట్) మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయాడు.   
 
 స్కోరు వివరాలు
 
 హైదరాబాద్ ఇన్నింగ్‌‌స: తన్మయ్ అగర్వాల్ (సి) సింగ్ (బి) బండేకర్ 91; అక్షత్ రెడ్డి (సి) మిషాల్ (బి) నర్వేకర్ 55, బద్రీనాథ్ రనౌట్ (బండేకర్) 49, అనిరుధ్ 9 నాటౌట్, రవితేజ  (బి) అమిత్ 3, సుమంత్ 12 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం 20 ఓవర్లలో 4 వికెట్లకు 224.
 
 వికెట్ల పతనం: 1-111, 2-198, 3-201, 4-211.
 
 బౌలింగ్: ఆర్‌ఆర్ సింగ్: 4-0-38-0; సౌరభ్ 4-0-54-1; జకాతి 3-0-36-0; అమిత్ యాదవ్ 3-0-34-1; జీడీ నర్వేకర్ 4-0-28-1; మిషాల్: 1-0-15-0; డీడీ గగోయ్ 1-0-18-0.
 
 గోవా ఇన్నింగ్‌‌స: షగుణ్ కామత్ (స్టంప్డ్) సుమంత్ (బి) భండారి 50, ఎస్‌ఏ అస్నోద్కర్ రనౌట్ (రవికిరణ్) 19, ఎస్‌ఎస్ కౌథాంకర్ (బి) సిరాజ్ 2, మిషాల్ (సి) రవికిరణ్ (బి) రవితేజ 25, బండేకర్ 53 నాటౌట్, వాజ్ (సి) మిలింద్ (బి) హసన్ 9, అమిత్ 6 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం 20 ఓవర్లలో 5 వికెట్లకు 173.
 
 వికెట్లపతనం: 1-28, 2-32, 3-102, 4-104, 5-132.
 బౌలింగ్: రవికిరణ్ 4-0-29-0; మిలింద్: 4-0-38-0, సిరాజ్ 4-0-24-1, టి. రవితేజ 4-0-33-1, భండారీ 3-0-30-1, హసన్ 1-0-14-1.

 

Advertisement
Advertisement