హైదరాబాద్ కే మారిన్.. | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ కే మారిన్..

Published Mon, Oct 9 2017 3:38 PM

hyderabad retains marin again

హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్) మూడో సీజన్ వేలంలో స్పెయిన్ స్టార్, ప్రపంచ నాల్గో ర్యాంకర్ కరోలినా మారిన్ ను హైదరాబాద్ హంటర్స్ మరోసారి దక్కించుకుంది. ఆమెకు రూ.50 లక్షలు వెచ్చించి మారిన్ ను కాపాడుకుంది. మరొకవైపు రూ.52 లక్షలతో మహిళల సింగిల్స్‌ నంబర్‌వన్‌ క్రీడాకారిణి తై జు యింగ్‌ను అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌ కైవసం చేసుకుంది. కాగా, భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్పను రూ.20లక్షలు వెచ్చించి ఢిల్లీ ఏసర్స్ దక్కించుకుంది. ఇక వరల్డ్ నంబర్ టూ పీవీ సింధును చెన్నై స్మాషర్స్ రూ. 48 లక్షల 75 వేలతో నిలుపుకుంది. మరొకవైపు సైనా నెహ్వాల్ కు 41 లక్షల 25 వేలతో అవేథ్ వారియర్స్ అట్టేపెట్టుకుంది. ఇక కిడాంబి శ్రీకాంత్ కు రూ.56 లక్షల 10 వేలతో అవేథ్ వారియర్స్ దక్కించుకుంది. గతేడాది వేలంలో శ్రీకాంత్ కు రూ.51లక్షల దక్కగా, ఈసారి దాదాపు పదిశాతం అధికంగా దక్కడం విశేషం.

పురుషుల వరల్డ్ నంబర్ వన్ విక్టర్ అలెక్సన్ ను రూ. 50 లక్షలతో  బెంగళూరు బ్లాస్టర్స్ కైవసం చేసుకుంది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ వేలంలో ఎనిమిది ఫ్రాంఛైజీలు పాల్గొన్నాయి. ఇందులో 133 మంది స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు వేలానికి అందుబాటులో ఉన్నారు. దీనిలో భాగంగా రూపొందించిన మోస్ట్ ఐకానిక్ ప్లేయర్స్ లిస్ట్ లోభారత్ నుంచి  కిడాంబి శ్రీకాంత్ ,పీవీ సింధు, సైనా నెహ్వాలకు చోటు లభించింది.

Advertisement
Advertisement