యువరాజ్ టార్గెట్ ఏంటో తెలుసా? | Sakshi
Sakshi News home page

యువరాజ్ టార్గెట్ ఏంటో తెలుసా?

Published Fri, Sep 2 2016 1:02 PM

యువరాజ్ టార్గెట్ ఏంటో తెలుసా?

భారత క్రికెట్ కు పరిచయం అక్కర్లేని ఆటగాడు యువరాజ్ సింగ్. 2011లో వన్డే ప్రపంచకప్ను భారత్ సాధించడంలో కీలక ఆటగాడు అయిన యువీ 'మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్' అందుకున్నాడు. కానీ పరిస్థితులు మారిపోయాయి.. నాలుగేళ్ల తర్వాత జరిగిన 2015 వన్డే వరల్డ్ కప్కు కనీసం భారత జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. ఫామ్ కోల్పోవడం, వరుస వైఫల్యాలతో జట్టుకు దూరమయ్యాడు. 2016 ట్వంటీ20 వరల్డ్ కప్లో ఆడిన యువీ సెలెక్టర్లను అంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన 2 టీ-20 సిరీస్ కు పిలుపు అందలేదు.

అందుకే ఇంకా క్రికెట్ ఆడుతున్నాను: యువీ
దులీప్ ట్రోఫీలో ఆడుతున్న యువీ మీడియాతో మాట్లాడుతూ.. 2019 వన్డే వరల్డ్ కప్ ఆడటమే తన లక్ష్యమని చెప్పాడు. జట్టులో మళ్లీ చోటు దక్కించుకునేందుకు దేశవాలీ లీగ్స్ లో ఆడుతున్నట్లు వెల్లడించాడు. 'టీమిండియాలో మళ్లీ చోటు అనేది చాలా కష్టమైన అంశం. అయితే ఆ అవకాశం వస్తుందన్న ఆశతోనే ఇంకా క్రికెట్ ఆడుతున్నాను. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. మరో మూడేళ్లు క్రికెట్ ఆడాలని ఉందని, తద్వారా వచ్చే వన్డే వరల్డ్ కప్ లో ఆడాలన్న నా లక్ష్యం నెరవేరుతుంది. నాకు ఇంకా దారులు తెరుచుకునే ఉన్నాయి' అని యువరాజ్ అభిప్రాయపడ్డాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement