‘అతనిలా బ్యాటింగ్‌ చేయడం ఇష్టం’

21 May, 2019 13:31 IST|Sakshi

కాబూల్‌: తనకు పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది అంటే చాలా అభిమానమని, అతనిలా బౌలింగ్‌ చేయడాన్ని ఎక్కువగా అనుకరిస్తానని అఫ్ఘానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ గతంలో చాలాసార్లు స్పష్టం చేశాడు. అయితే అప్పుడప్పుడు తన బ్యాట్‌ నుంచి వచ్చే భారీ షాట్లకు స్ఫూర్తి కూడా షాహిద్‌ అఫ్రిదినే కారణమని తాజా ఇంటర్య్యూలో రషీద్‌ పేర్కొన్నాడు. తనకు అఫ్రిది బ్యాటింగ్‌ అంటే చాలా ఇష్టమని, అతనిలా బ్యాటింగ్‌ చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడతానన్నాడు. స్వతహాగా ఓపెనింగ్‌  బ్యాట్స్‌మన్‌ అయిన రషీద్‌.. ఆపై స్పిన్నర్‌గా రూపాంతరం చెందాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇప్పటికే తనదైన మార్కు బౌలింగ్‌తో దిగ్గజాల ప్రశంసలు సైతం అందుకుంటున్నాడు రషీద్‌.

ఇప్పుడు అఫ్రిది బౌలింగ్‌ శైలే కాదు.. అతని బ్యాటింగ్‌ కూడా అంటే అత్యంత ఇష్టమని తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో తాను ఎక్కువ అభిమానించేది అఫ్రిదినేనని తెలిపిన రషీద్‌.. అతని బ్యాటింగ్‌ ఎందుకో ఇష్టమో వివరణ ఇచ్చాడు. ‘ అఫ్రిది రికార్డును చెక్‌ చేసుకోండి. ఆ తరహా క్రికెటర్లు రావడం చాలా అరుదు. అఫ్రిది ఖాతాలో ఎక్కువ సెంచరీలు లేకపోవచ్చు. అతను ఎప్పుడైతే బ్యాట్‌ పట్టుకుని క్రీజ్‌లోకి వచ్చే వాడో అభిమానుల్ని ఎక్కువగా అలరించేవాడు. కనీసం నాలుగు, ఐదు సిక్సర్లు సాధించినా అత్యంత ఎక్కువగా ఆకర్షించే వాడు. అతను క్రీజ్‌లో ఎక్కువ సేపు లేకపోయినా వినోదాన్ని పంచడంలో ముందుండేవాడు. అందుచేత అతనికి నేను అభిమానిని అయ్యా. అఫ్రిది తరహాలో బ్యాటింగ్‌ చేయడమంటే నాకు చాలా ఇష్టం’ అని ఈ అఫ్ఘాన్‌ సంచలనం పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘విశ్రాంతి వద్దు.. నేను వెళతాను!’

ఐసీసీ కీలక నిర్ణయం యాషెస్‌ నుంచే అమలు!

కోచ్‌ల కోసం తొందరెందుకు?

స్టోక్స్‌ వద్దన్నా.. అంపైర్లు వింటేగా

పంత్‌ కోసం ధోనీ చేయబోతుందిదే!

‘బౌండరీ’కి బదులు రెండో సూపర్‌

విలియమ్సన్‌పై రవిశాస్త్రి ప్రశంసలు

ఆ ‘స్పెషల్‌’ జాబితాలో రోహిత్‌శర్మ

ఓ 50 ఏళ్లు దాటాక వీళ్లు ఎలా ఉంటారంటే..!

గాయం బెడద భయం గొల్పుతోంది

ఆఖరి స్థానంతో సరి

మళ్లీ గెలిచిన గేల్‌

ప్రధానితో ప్రపంచకప్‌ విజేత

సిక్కి రెడ్డి జంటకు మిశ్రమ ఫలితాలు

సచిన్‌ ప్రపంచకప్‌ జట్టులో ఐదుగురు భారత ఆటగాళ్లు

ఫైనల్లో పరాజితులు లేరు 

60 ఏళ్లకు మించరాదు! 

టీమిండియా కోచ్‌కు కొత్త నిబంధనలు!

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

‘ఇద్దరు పిల్లల తల్లి .. నాలుగు స్వర్ణాలు గెలిచింది’

‘అప్పుడు సిక్స్‌తోనే సమాధానం ఉండేది’

వారి నిర్ణయమే ఫైనల్‌: ఐసీసీ

సచిన్‌ వరల్డ్‌కప్‌ జట్టు ఇదే..

ఐసీసీ రూల్‌పై ‘బిగ్‌’ పంచ్‌!

బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా జాఫర్‌

ఓవర్‌త్రోను చూసి ఎగిరి గంతులేశాడు!

ఆ సలహానే పని చేసింది: ఆర్చర్‌

శ్రీవల్లి రష్మిక, సాత్విక ముందంజ

చాంపియన్‌ కార్తీక్‌ సాయి

సింధు, శ్రీకాంత్‌లపైనే ఆశలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’