వన్డే క్రికెట్ నిబంధనల్లో కీలక సవరణలు | Sakshi
Sakshi News home page

వన్డే క్రికెట్ నిబంధనల్లో కీలక సవరణలు

Published Sat, Jun 27 2015 11:18 AM

వన్డే క్రికెట్ నిబంధనల్లో కీలక సవరణలు

బార్బోడాస్: ఇప్పటివరకూ మనం వన్డే క్రికెట్ లో చూసిన ఆటతీరుకు ఫుల్ స్టాప్ పడనుందా?,  ఈ ఫార్మాట్ లో మరింత అందాన్నిఅలంకరించేందుకు క్రికెట్ పెద్దలు సన్నద్ధమయ్యారా?  అంటే అవుననక తప్పదు. వన్డే క్రికెట్  లో బౌలర్లకు అత్యంత ఊరటనిస్తూ తొలి పది ఓవర్ల పవర్ ప్లేను ఐసీసీ తొలగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు చివరి పది ఓవర్లలో 30 యార్డ్ సర్కిల్ లో ఐదుగురు ఫీల్డర్లు ఉండకూడదన్న పాత నిబంధనను కూడా తొలగించింది. కాగా, అన్ని రకాల నోబెల్స్ కు ఫ్రీ హిట్ నిబంధనను వర్తింపచేయడానికి ఐసీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఓవర్ స్టెప్పింగ్ నోబాల్స్ తో పాటు,  బౌన్సర్ల రూపంలో వచ్చే నోబాల్స్ కూడా ఫ్రీ హిట్ ను కొనసాగింనున్నారు.

 

ఈ మేరకు తాజాగా జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో కొన్ని కీలక సవరణలు చేశారు. ఈ నిబంధనలు జూలై 5 నుంచి అమల్లోకి రానున్నట్లు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్ సన్ తెలిపాడు. దీనికి సంబంధించి గత నెల్లో అనిల్ కుంబ్లే అధ్యక్షతన ముంబైలో జరిగిన ఐసీసీ క్రికెట్ కమిటీ సమావేశంలోని పలు సిఫారుసులను పరిగణలోకి తీసుకున్న అనంతరం వన్డే నిబంధనల్లో మార్పులకు నడుంబిగించారు.

Advertisement
Advertisement