వెస్టిండీస్‌ శుభారంభం  | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్‌ శుభారంభం 

Published Wed, Mar 7 2018 1:23 AM

ICC World Cup qualifiers 2018: Chris Gayle slams 23rd ODI century - Sakshi

హరారే: ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో వెస్టిండీస్‌ శుభారంభం చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్‌ 60 పరుగుల తేడాతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) పై విజయం సాధించింది. ముందుగా వెస్టిండీస్‌ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. షిమ్రాన్‌ హెట్‌మర్‌ (93 బంతుల్లో 127; 14 ఫోర్లు, 4 సిక్సర్లు), క్రిస్‌ గేల్‌ (91 బంతుల్లో 123; 7 ఫోర్లు, 11 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు. అనంతరం యూఏఈ 50 ఓవర్లలో 6 వికెట్లకు 297 పరుగులు చేసింది. రమీజ్‌ షహజాద్‌ (107 బంతుల్లో 112 నాటౌట్‌; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకంతో పోరాడినా జట్టును గెలిపించలేకపో యాడు. షైమాన్‌ అన్వర్‌ 64 పరుగులు సాధించగా...జేసన్‌ హోల్డర్‌ (5/53) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మరో మ్యాచ్‌లో జింబాబ్వే 2 పరుగులతో అఫ్గానిస్తాన్‌ను ఓడించింది. ముందుగా జింబాబ్వే 43 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌట్‌ కాగా... అఫ్గానిస్తాన్‌ 49.3 ఓవర్లలో 194 పరుగులే చేయగలిగింది.  

► 3 విండీస్‌ క్రికెటర్‌ గేల్‌ 11 వేర్వేరు దేశాలపై సెంచరీలు చేసిన మూడో క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో సచిన్, ఆమ్లా మాత్రమే ఈ ఘనత సాధించారు.    

Advertisement
Advertisement