రోహిత్‌.. నువ్వు సూపరో సూపర్‌! | Sakshi
Sakshi News home page

రోహిత్‌.. నువ్వు సూపరో సూపర్‌!

Published Fri, Jan 24 2020 1:14 PM

IND Vs NZ: Rohit Sharma Takes Superb Catch - Sakshi

ఆక్లాండ్‌: భారత క్రికెట్ జట్టులో మనకు రోహిత్‌ శర్మ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గానే బాగా తెలుసు. అతనిలో కూడా ఓ మంచి ఫీల్డర్‌ ఉన్నాడని నిరూపించుకున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో  రోహిత్‌ ఓ అద్భుతమైన క్యాచ్‌తో ఔరా అనిపించాడు. శివం దూబే వేసిన ఎనిమిదో ఓవర్‌ ఐదో బంతికి మార్టిన్‌ గప్టిల్‌ డీప్‌ స్వేర్‌ లెగ్‌పై భారీ షాట్‌ కొట్టాడు. కాగా, అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మ బంతిని ఒడిసి పట్టుకున్న  తీరు అమోఘం. బంతి గమనాన్ని కచ్చితంగా అంచనా వేసిన రోహిత్‌.. అదే సమయంలో బౌండరీ లైన్‌ తొక్కకుండా క్యాచ్‌ను అందుకున్నాడు. బౌండరీ లైన్‌ తాకే క్రమంలో బంతిని పట్టుకుని ఒకసారి మైదానంలోకి మెల్లగా విసిరేసి మళ్లీ తిరగొచ్చి పట్టుకున్నాడు. ఒక ప్రొఫెషనల్‌ ఫీల్డర్‌ తరహాలో రోహిత్‌ క్యాచ్‌ను అందుకోవడం హైలైట్‌గా నిలిచింది. 

ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి ముందుగా ఫీలింగ్‌ తీసుకుంది. దాంతో కివీస్‌ ఇన్నింగ్స్‌ను గప్టిల్‌- మున్రోలు ఆరంభించారు. వీరిద్దరూ ఓవర్‌కు పది పరుగులు తగ్గకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వరుసగా భారీ హిట్లు కొడుతూ భారత్‌ బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగారు. అందులోనూ స్టేడియం చిన్నది కావడంతో సునాయాసంగా బౌండరీలు వచ్చాయి. ఈ క్రమంలో గప్టిల్‌ భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌ చేరాడు. గప్టిల్‌ 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. మున్రో  36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్థ శతకం సాధించాడు.( ఇక్కడ చదవండి: ‘పంత్‌ను అలా చూడాలనుకుంటున్నా’)

Advertisement
Advertisement