ప్రతీసారి కెప్టెన్‌ ఆదేశాలు ఇవ్వడం కుదరదు | Sakshi
Sakshi News home page

ప్రతీసారి కెప్టెన్‌ ఆదేశాలు ఇవ్వడం కుదరదు

Published Sat, Feb 8 2020 7:58 AM

IND Vs NZ: Sridhar Admits India Have Been Average In Field - Sakshi

ఆక్లాండ్‌: భారత ఫీల్డింగ్‌ ఇటీవల నాసిరకంగా ఉందనేది వాస్తవం. సరిగ్గా చెప్పాలంటే ప్రపంచకప్‌ వరకు లేదా అంతకుముందు రెండేళ్ల నుంచి మేం నెలకొల్పిన అత్యున్నత ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యాం. దీనిని మెరుగుపర్చేందుకు మేం కచ్చితంగాగా దృష్టి పెట్టాల్సి ఉంది. నిజానికి వరుస మ్యాచ్‌ల కారణంగా మాకు ఫీల్డింగ్‌ కోసం ప్రత్యేకంగా సన్నద్ధమయ్యే అవకాశమే రావడం లేదు. ఒక ఆటగాడు క్యాచ్‌ వదిలేశాడంటే దానికి అనేక కారణాలుంటాయి. ముఖ్యంగా టి20ల్లో మైదానంలో ప్రతీ ఆటగాడు తనను తాను కెప్టెన్‌గా భావిస్తూనే ఫీల్డింగ్‌ చేయాలి. ఈ విషయం వారికి కూడా చెప్పాం. బంతి గమనం, గాలివాటం వంటివి అంచనా వేసి సరైన స్థానంలో నిలబడి బంతిని అందుకునేందుకు సిద్ధం కావాలి. ప్రతీ సారి కెప్టెన్‌ ఆదేశాలివ్వడం కుదరదు.     
– ఆర్‌. శ్రీధర్, భారత్‌ ఫీల్డింగ్‌ కోచ్‌  

Advertisement
Advertisement