మళ్లీ టీమిండియానే.. | Sakshi
Sakshi News home page

మళ్లీ టీమిండియానే..

Published Sun, Oct 23 2016 1:04 PM

మళ్లీ టీమిండియానే..

మొహాలి:ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ) స్టేడియంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ తో జరిగే సుదీర్ఘ సిరీస్లో భారత జట్టు ఇలా టాస్ గెలవడం ఆరోసారి. గత ఐదు మ్యాచ్ల్లో(మూడు టెస్టుల సహా) భారత్ నే టాస్ వరించిడం విశేషం.  ఈ మ్యాచ్లో భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, న్యూజిలాండ్ జట్టులో తిరిగి నీషామ్ వచ్చి చేరాడు. డెవిచ్ స్థానంలో నీషామ్ను తుది జట్టులోకి తీసుకున్నారు.


గత మ్యాచ్లో భారత్ ను ఓడించిన న్యూజిలాండ్ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తుండగా, భారత్ మాత్రం న్యూజిలాండ్ను ఓడించి సిరీస్లో ముందంజ వేయాలని యోచిస్తోంది. రెండో వన్డేలో గెలుపు న్యూజిలాండ్ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.   న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాగా, ఆ మ్యాచ్లో భారత్ పోరాడి ఓడిపోవడం జట్టును ఆందోళనకు గురి చేసింది.

ఇదిలా ఉంచితే, మొహాలీలో భారత్ జట్టు మంచి వన్డే రికార్డును కల్గి వుంది. ఇక్కడ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(పీసీఏ)లో ఇప్పటివరకూ భారత్ ఓవరాల్ గా 13 వన్డేలు ఆడగా, ఎనిమిదింట విజయం సాధించింది. ఐదు వన్డేల్లో ఓటమి పాలైంది. ఈ స్టేడియంలో భారత్ తొలిసారి 1993లో దక్షిణాఫ్రికాపై గెలవగా, చివరిసారి 2013 లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ఓటమి పాలైంది. కాగా, 2016లో ఇక్కడ ఆస్ట్రేలియాతో చివరిసారి  ఆడిన వరల్డ్ టీ20లో భారత్ జయకేతనం ఎగురవేసింది.

 

న్యూజిలాండ్ తుది జట్టు:కేన్ విలియమ్సన్(కెప్టెన్) మార్టిన్ గప్టిల్, టామ్ లాధమ్, రాస్ టేలర్, కోరీ అండర్సన్, ల్యూక్ రోంచీ, నీషామ్, సాంట్నార్, సౌథీ , హెన్రీ, బౌల్ట్

భారత తుది జట్టు: ఎంఎస్ ధోని(కెప్టెన్), రోహిత్ శర్మ,అజింక్యా రహానే, విరాట్ కోహ్లి,  మనీష్ పాండే, కేదర్ జాదవ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, అమిత్ మిశ్రా,ఉమేశ్ యాదవ్, బూమ్రా

Advertisement
Advertisement