భారత్ X పాక్ | Sakshi
Sakshi News home page

భారత్ X పాక్

Published Sun, Dec 4 2016 2:42 AM

India, Pakistan face off in women's Asia Cup T20 final

నేడు ఆసియా మహిళల టి20 ఫైనల్
బ్యాంకాక్: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు ఆసియా మహిళల టి20 క్రికెట్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారుు. ఆదివారం జరిగే ఈ ఫైనల్లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. లీగ్ దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఆరు జట్ల మధ్య లీగ్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత పారుుంట్ల పట్టికలో భారత్ (10 పారుుంట్లు), పాక్ (8 పారుుంట్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు చేరారుు. శనివారం జరిగిన చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో థాయ్‌లాండ్‌పై, శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలుపొందారుు.

Advertisement

తప్పక చదవండి

Advertisement