మెడిసిన్ బాల్... స్టూల్‌పై బౌలర్లు | Sakshi
Sakshi News home page

మెడిసిన్ బాల్... స్టూల్‌పై బౌలర్లు

Published Fri, Feb 13 2015 8:33 AM

మెడిసిన్ బాల్... స్టూల్‌పై బౌలర్లు

భారత క్రికెటర్ల వినూత్న ప్రాక్టీస్
 అడిలైడ్: ప్రపంచకప్‌కు ముందు భారత క్రికెటర్లు ప్రాక్టీస్‌లో కొత్త పోకడలు తెచ్చారు. ప్రతి రోజూ చేసే ప్రాక్టీస్‌తో పాటు అదనంగా మెడిసిన్ బాల్(బరువైన లెదర్ బంతి)ను త్రో చేయడం ప్రాక్టీస్ చేశారు. అలా గే బౌలర్‌ను స్టూల్‌పై నిలబెట్టి బంతులు వేయించి, వాటిని భారత బ్యాట్స్‌మెన్ ఆడారు.
 
  వివరాల్లోకి వెళితే... ఒక రోజు విరా మం తర్వాత భారత క్రికెటర్లు సెయింట్ పీటర్స్ కాలేజీ గ్రౌండ్‌లో నెట్ సెషన్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆటగాళ్లు గ్రూప్‌లుగా విడిపోయి అడిలైడ్ ఓవల్ మైదానానికి చేరారు. ఇక్కడ ట్రెయినర్ పీవీ సుదర్శన్ ఆధ్వర్యంలో కసరత్తులు చేశారు. అయితే ఈ సెషన్‌కు కోహ్లి పూర్తిగా నల్లటి దుస్తులు ధరించి వచ్చాడు.అదే విధంగా ఆటగాళ్ల ప్రాక్టీస్ దగ్గరకు మీడియాను రానీయకుండా ప్రత్యేక భద్రతా అధికారులను నియమించారు. ఆటగాళ్లు ఇద్దరు, ఇద్దరుగా విడిపోయి ‘మెడిసిన్ బాల్’ను ఒకరిపై ఒకరు విసిరి క్యాచ్‌లు పట్టారు. కెప్టె న్ ధోని మాత్రం నెట్ ప్రాక్టీస్ ముగియగానే ప్రపంచకప్ ప్రారంభోత్సవం కోసం మెల్‌బోర్న్ వెళ్లాడు.
 
 ఇర్ఫాన్‌ను సమర్థంగా ఆడేందుకు...
 భారత ప్రాక్టీస్‌లో ఒక నెట్‌లో రెండు స్టూల్స్ వేశారు. భారత జట్టు సహాయక సిబ్బందితో పాటు స్థానిక బౌలర్లు కూడా ఆ స్టూల్స్ మీదకు వెళ్లి బంతులు వేశారు. వీటిని భారత బ్యాట్స్‌మెన్ ఆడటం ప్రాక్టీస్ చేశారు. పాకిస్తాన్ జట్టులో ఉన్న పేసర్ మొహమ్మద్ ఇర్ఫాన్‌ను సమర్థంగా ఎదుర్కోవడం కోసం ఇది ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. ఇర్ఫాన్ ఎత్తు 7 అడుగుల 1 అంగుళం. అడిలైడ్‌లో బౌన్సీ పిచ్ అతడి శైలికి సరిపోయే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో అంత ఎత్తు నుంచి వచ్చే బంతులను ఆడటం కోసం నెట్స్‌లో ఈ ఏర్పాట్లు చేశారు.
 

Advertisement
Advertisement