భారత్‌కు రెండో విజయం | Sakshi
Sakshi News home page

భారత్‌కు రెండో విజయం

Published Thu, Apr 23 2015 12:54 AM

India second victory

ప్రపంచ పురుషుల టీమ్ చెస్
 సాగ్‌కద్జోర్ (ఆర్మేనియా):  ప్రపంచ పురుషుల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. హంగేరితో జరిగిన నాలుగో రౌండ్‌లో భారత్ 2.5-1.5 తేడాతో గెలి చింది. పెంటేల హరికృష్ణ, పీటర్ లెకో గేమ్ 22 ఎత్తుల్లో; సేతరామన్, ఎర్దోస్ గేమ్ 21 ఎత్తుల్లో; శశికిరణ్, అల్మాసీ గేమ్ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. నాలుగో గేమ్‌లో విదిత్ 64 ఎత్తుల్లో రాపోట్‌ను ఓడించి భారత్‌కు విజయాన్ని అందించాడు.  
 
 రష్యా చేతిలో భారత్ ఓటమి
 మరోవైపు చైనాలో జరుగుతున్న ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో ఓటమి ఎదురైంది. రష్యా జట్టుతో బుధవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో భారత్ 1.5-2.5 తేడాతో ఓడింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 60 ఎత్తుల్లో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ను ఓడించగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 42 ఎత్తుల్లో వాలెంటినా గునీనా చేతిలో పరాజయం పాలైంది. పద్మిని రౌత్, అలెగ్జాండ్రా గొర్యాచికినాల మధ్య గేమ్ 55 ఎత్తుల్లో ‘డ్రా’ కాగా... సౌమ్య స్వామినాథన్ 76 ఎత్తుల్లో ఓల్గా గిర్యా చేతిలో ఓడిపోయింది. గురువారం జరిగే ఐదో రౌండ్‌లో అమెరికాతో భారత్ తలపడుతుంది.
 

Advertisement
Advertisement