ఎనిమిదేళ్ల తరువాత పూర్తిస్థాయి సిరీస్ | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్ల తరువాత పూర్తిస్థాయి సిరీస్

Published Sat, Jul 8 2017 11:38 AM

ఎనిమిదేళ్ల తరువాత పూర్తిస్థాయి సిరీస్ - Sakshi

కొలంబో:ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం భారత్ -శ్రీలంక క్రికెట్ జట్లు తొలిసారి పూర్తిస్థాయి సిరీస్ లో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య  ద్వైపాక్షిక సిరీస్ జరుగనున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం శ్రీలంకలో భారత పర్యటన షెడ్యూల్ ను విడుదల చేసింది.

ఈ ద్వైపాక్షిక సిరీస్ లో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక ట్వంటీ 20 జరుగనుంది.ఇలా ఇరు జట్ల మధ్య మూడు ఫార్మాట్లలో సిరీస్ జరగడం ఎనిమిదేళ్ల తరువాత ఇదే మొదటిసారి. 2009లో భారత్ లో శ్రీలంక పర్యటించింది. అప్పుడు మూడు టెస్టుల సిరీస్ తో పాటు, ఐదు వన్డేల సిరీస్, రెండు ట్వంటీ 20ల సిరీస్లు ఇరు జట్ల మధ్య జరిగాయి. అది ఇరు జట్ల మధ్య జరిగిన పూర్తిస్థాయి చివరిసిరీస్.కాగా, రెండేళ్ల క్రితం శ్రీలంకలో భారత్ పర్యటించినప్పటికీ టెస్టు సిరీస్, వన్డే సిరీస్ మాత్రమే జరిగింది.


షెడ్యూల్ వివరాలు..

జూలై 26; తొలి టెస్టు, గాలే

ఆగస్టు 3; రెండో టెస్టు, కొలంబో

ఆగస్టు 12; మూడో టెస్టు, కాండీ

ఆగస్టు 20; తొలి వన్డే, దంబుల్లా

ఆగస్టు 24; రెండో వన్డే, కాండీ

ఆగస్టు 27; మూడో వన్డే, కాండీ

ఆగస్టు 31; నాల్గో వన్డే, కొలంబో

సెప్టెంబర్ 3; ఐదో వన్డే, కొలంబో

సెప్టెంబర్ 6; తొలి ట్వంటీ 20, కొలంబో
 

Advertisement
Advertisement