భారత్‌కు కొరియా షాక్ | Sakshi
Sakshi News home page

భారత్‌కు కొరియా షాక్

Published Sat, Oct 8 2016 12:03 AM

భారత్‌కు కొరియా షాక్

• కబడ్డీ ప్రపంచకప్‌లో పెను సంచలనం  
• ఆఖరి క్షణాల్లో ఓడిన ఆతిథ్య జట్టు

అహ్మదాబాద్: తొమ్మిదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న కబడ్డీ ప్రపంచకప్ పెను సంచలనంతో ప్రారంభమైంది. ప్రొ కబడ్డీ లీగ్ ద్వారా స్టార్స్‌గా మారిన భారత ఆటగాళ్లు ప్రపంచ వేదికపై మాత్రం షాక్ తిన్నారు. ప్రొ కబడ్డీలో కోల్‌కతా తరఫున ఆడి భారత్‌కు చిరపరిచితుడైన కొరియా ఆటగాడు జాంగ్ కున్ లీ సంచలన ఆటతీరుతో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. శనివారం జరిగిన టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో కొరియా 34-32తో భారత్‌ను ఓడించింది.

తొలి ఐదు నిమిషాల్లో కొరియా 4-2 ఆధిక్యంతో ఉన్నా... భారత జట్టు పుంజుకుని వరుస పాయి0ట్లతో స్టేడియంను హోరెత్తించింది. దీంతో ప్రథమార్ధంలో భారత్ 18-13తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ద్వితీయార్ధంలోనూ భారత్ ఓ దశలో 27-21తో ఆధిక్యంలో ఉంది. అయి0తే చివరి ఐదు నిమిషాల్లో కొరియా ఆటగాళ్లు చెలరేగిపోయారు. పటిష్టమైన డిఫెన్‌‌సతో టాకిల్ పాయి0ట్లు సాధించారు. మరోవైపు కున్ లీ చివరి మూడు నిమిషాల్లో ఏకంగా ఎనిమిది పాయి0ట్లు తెచ్చాడు. 39వ నిమిషం వరకు 29-27తో ఆధిక్యంలో ఉన్న భారత్... చివరి నిమిషంలో మ్యాచ్‌ను కోల్పోయి0ది.

 కొరియా తరఫున కున్ లీ మొత్తం పది పాయి0ట్లు సాధించడంతో పాటు మరో ఐదు బోనస్ పాయి0ట్లు కూడా తెచ్చాడు. డాంగ్ జియోన్ లీ ఆరు పాయి0ట్లు సాధించాడు. భారత్ తరఫున కెప్టెన్ అనూప్ కుమార్ 9 పాయి0ట్లు సాధించడంతో పాటు మూడు బోనస్ పాయి0ట్లు తెచ్చాడు. మంజీత్ చిల్లర్ ఐదు పాయి0ట్లు తెచ్చాడు. స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరి 9 సార్లు రైడింగ్‌కు వెళ్లి 3 పాయి0ట్లు తెచ్చాడు. కబడ్డీ చరిత్రలో భారత్‌పై కొరియా గెలవడం ఇదే తొలిసారి. మరో మ్యాచ్‌లో ఇరాన్ 52-15 స్కోరుతో అమెరికాపై గెలిచింది. మేరాజ్, ఫాజల్ ఐదేసి పాయింట్లు సాధించారు.

వైభవంగా ఆరంభం
కబడ్డీ ప్రపంచకప్ కలర్‌ఫుల్‌గా ప్రారంభమైంది. తొలుత కళాకారుల విన్యాసాలు, లేజర్ మెరుపులతో కార్యక్రమం సాగింది. ఆ తర్వాత భారత సంప్రదాయ పద్దతిలో ఒక్కో జట్టు కెప్టెన్‌ను కోర్టులోకి తీసుకొచ్చారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ముఖ్య అతిధిగా ప్రసంగించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement