ఏడేళ్లలో టీమిండియా తొలిసారి.. | Sakshi
Sakshi News home page

ఏడేళ్లలో టీమిండియా తొలిసారి..

Published Sat, Mar 18 2017 1:59 PM

ఏడేళ్లలో టీమిండియా తొలిసారి..

రాంచీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు దీటుగా బదులిస్తోంది. టాప్-3 ఆటగాళ్లు యాభై అంతకంటే ఎక్కువ వ్యక్తిగత పరుగులు సాధించి భారత్ ఇన్నింగ్స్ కు చక్కటి పునాది వేశారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్(67), మురళీ విజయ్(82) హాఫ్ సెంచరీలు సాధించగా, ఆ తరువాత ఫస్ట డౌన్ లో వచ్చిన చటేశ్వర పూజారా కూడా యాభైకి పైగా పరుగులు నమోదు చేశాడు.

 

ఇలా ఒక సిరీస్ మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ టాప్-3 ఆటగాళ్లు యాభై అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం ఏడేళ్ల తరువాత ఇదే తొలిసారి. 2010లో చివరిసారి భారత్ టాప్-3 ఆటగాళ్లు ఈ ఘనతను సాధించారు. న్యూజిలాండ్ తో నాగ్ పూర్ లో జరిగిన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ టాపార్డర్ విశేషంగా రాణించింది.  కాగా, 2006 నుంచి 2010 వరకూ చూస్తే  భారత టాప్-3 ఆటగాళ్లు  ఈ తరహా ఇన్నింగ్స్ లను ఎనిమిదిసార్లు నమోదు చేయగా..  ఆ తరువాత ఆ ఫీట్ ను ఒకసారి మాత్రమే సాధించడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

Advertisement

తప్పక చదవండి

Advertisement