పీకల్లోతు కష్టాల్లో టీమిండియా | Sakshi
Sakshi News home page

పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

Published Wed, Jan 17 2018 2:19 PM

India vs south africa: continue to loss wickets in 2nd test Day 5 - Sakshi

సెంచూరియన్‌ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌ లో భారత్‌ ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోపడింది. పుజారా(19) రనౌట్‌ అవ్వగా, భారీ షాట్‌కు యత్నించి పార్దీవ్‌ పటేల్‌, అశ్విన్‌, పాండ్యాలు కీపర్‌ కి క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యారు. భారత్‌ 87పరుగులకు 7 వికెట్లు నష్టపోయింది. రోహిత్, షమీలు కలిసి పోరాడుతున్నారు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ 258 పరుగులకు ఆలౌట్‌ కావడంతో భారత్‌ ఎదుట 287 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.

భారత్‌ ఓపెనర్లు మురళి విజయ్‌(9), కేఎల్‌ రాహుల్‌(4)లు మరోసారి విఫలమవ్వగా.. తొలి ఇన్నింగ్స్‌లో  సెంచరీతో గట్టెక్కించిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(5) సైతం నిరాశపరిచాడు. ఐదో రోజు ఆట ఆరంభంలోనే పుజారా, పార్దీవ్‌ పటేల్‌, పాండ్యాలు, అశ్విన్‌లు అవుటయ్యారు. రోహిత్‌ శర్మ, షమీలు క్రీజ్‌లో ఉన్నారు. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడి 4, రబడా 2 వికెట్లు తీశారు.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 335 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 258 ఆలౌట్‌
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 307, రెండో ఇన్నింగ్స్‌ 141/7

Advertisement
Advertisement