పసికూనలపై ఫుల్ ప్రాక్టీస్ | Sakshi
Sakshi News home page

పసికూనలపై ఫుల్ ప్రాక్టీస్

Published Tue, Feb 10 2015 4:36 PM

పసికూనలపై ఫుల్ ప్రాక్టీస్

అడిలైడ్: వరల్డ్ కప్ సన్నాహక మ్యాచ్ ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో టీమిండియా 153 పరుగులతో ఘన విజయం సాధించింది. గత వార్మప్ మ్యాచ్ లో ఆసీస్పై చావుదెబ్బ తిన్న టీమిండియా ఈ మ్యాచ్ లో మాత్రం అన్ని విభాగాల్లో రాణించింది. పెద్ద జట్లపై చెత్తప్రదర్శనతో విమర్శలపాలైన ధోనీసేనకు పసికూనలపై ఫుల్ ప్రాక్టీస్ లభించింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 364 భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (122 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 150) సెంచరీతో చెలరేగాడు. అతనికి తోడు సురేశ్ రైనా 71 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 75, అజింక్య రహానె 61 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 88 నాటౌట్గా నిలిచి ఆఫ్ఘనిస్తాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఆఫ్ఘన్ బౌలర్లలో హమిద్ హసన్, మహ్మద్ నబి. దవ్లాత్ జద్రన్, షాపూర్ జద్రన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

భారీ లక్ష్యఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 211 పరుగులే చేసింది. మంగల్ (60) అర్ధ శతకంతో పాటు ఘని (44)  రాణించారు. మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేదు. భారత బౌలర్లలో మోహిత్ శర్మ 2 వికెట్లు, రవీంద్ర జడేజా 2, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, సురేశ్ రైనా ఒక్కో వికెట్ తీశారు.  

Advertisement
Advertisement