భారత బౌలర్ల విజృంభణ.. కష్టాల్లో కివీస్‌

26 Jan, 2019 13:41 IST|Sakshi

మౌంట్‌ మాంగనీ: టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్‌ కష్టాల్లో పడింది. 325 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన కివీస్ 146 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. మార్టిన్‌ గప్టిల్‌(15), విలియమ్సన్‌(20), మున్రో(31), రాస్‌ టేలర్‌(22), టామ్‌ లాధమ్‌(34), గ్రాండ్‌ హోమ్‌(3)వికెట్లను చేజార్చుకుంది. కివీస్‌ కోల్పోయిన ఆరు వికెట్లలో కుల్దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లు సాధించగా, భువనేశ్వర్‌ కుమార్‌, షమీ, చహల్‌, కేదర్‌ జాదవ్‌, లకు తలో వికెట్‌ లభించింది.

లక్ష్య ఛేదనలో ధాటిగా బ్యాటింగ్‌ ఆరంభించిన కివీస్‌ 15 ఓవర్లలోపే మూడు ప్రధాన వికెట్లను చేజార్చుకుంది. కివీస్‌ టాపార్డర్‌ను తేరుకోనీయకుండానే చేయడంతో మ్యాచ్‌పై భారత్‌ పట్టు సాధించింది. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 325 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ‌(87; 96 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్‌ ధావన్‌(66; 67 బంతుల్లో 9 ఫోర్లు)ల  హాఫ్‌ సెంచరీలకు తోడు విరాట్‌ కోహ్లి(43; 45 బంతుల్లో 5 ఫోర్లు) , అంబటి రాయుడు(47; 49 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌), ఎంఎస్‌ ధోని(48 నాటౌట్‌;33 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌)లు రాణించడంతో భారత్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 324 పరుగుల భారీ స్కోరు చేసింది.

మరిన్ని వార్తలు