ఆసియా క్రీడలకు హుసాముద్దీన్‌

30 Jun, 2018 05:06 IST|Sakshi
తెలంగాణ బాక్సర్‌ మొహమ్మద్‌ హుసాముద్దీన్‌

భారత బాక్సింగ్‌ జట్ల ప్రకటన

న్యూఢిల్లీ: రెండేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తోన్న తెలంగాణ బాక్సర్‌ మొహమ్మద్‌ హుసాముద్దీన్‌కు తగిన గుర్తింపు లభించింది. వచ్చే ఆగస్టు–సెప్టెంబర్‌లో ఇండోనేసియా వేదికగా జరిగే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బాక్సింగ్‌ జట్టులో హుసాముద్దీన్‌కు (56 కేజీలు) స్థానం దక్కింది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన 24 ఏళ్ల హుసాముద్దీన్‌ ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించాడు. గతవారం జర్మనీలో జరిగిన కెమిస్ట్రీ కప్‌ అంతర్జాతీయ టోర్నీలో హుసాముద్దీన్‌ స్వర్ణం దక్కించుకున్నాడు. ఫలితంగా ఎలాంటి ట్రయల్స్‌ లేకుండానే అతనికి జట్టులో బెర్త్‌ ఖాయమైంది.  

భారత పురుషుల బాక్సింగ్‌ జట్టు: అమిత్‌ పంగల్‌ (49 కేజీలు), గౌరవ్‌ సోలంకి (52 కేజీలు), మొహమ్మద్‌ హుసాముద్దీన్‌ (56 కేజీలు), శివ థాపా (60 కేజీలు), ధీరజ్‌ (64 కేజీలు), మనోజ్‌ కుమార్‌ (69 కేజీలు), వికాస్‌ కృషన్‌ (75 కేజీలు).

మహిళల జట్టు: సర్జూబాలా దేవి (51 కేజీలు), సోనియా లాథెర్‌ (57 కేజీలు), పవిత్ర (60 కేజీలు).

మరిన్ని వార్తలు