సరికొత్త చరిత్ర సృష్టించిన రణ్ వీర్ సింగ్ | Sakshi
Sakshi News home page

సరికొత్త చరిత్ర సృష్టించిన రణ్ వీర్ సింగ్

Published Sat, Aug 1 2015 12:30 PM

సరికొత్త చరిత్ర సృష్టించిన రణ్ వీర్ సింగ్

లాస్ ఎంజెల్స్: రణ్వీర్ సింగ్ సైని భారత్ తరఫున సరికొత్త చరిత్ర సృష్టించాడు. స్పెషల్ ఒలంపిక్స్ వరల్డ్ గేమ్స్లో స్వర్ణం సాధించి భారత్ తరఫున ఈ ఘన సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. లాస్ ఎంజిల్స్లో శుక్రవారం జరిగిన ఈ గేమ్లో 14 ఏళ్ల గోల్ఫర్ సైనీ తన భాగస్వామి మోనికా జగూతో కలిసి ఈ అరుదైన ఫీట్ సాధించాడు.

గుర్గావ్కు చెందిన రణ్వీర్ సైని ఆటిజంతో సతమతమవుతున్నాడు. రెండేళ్ల వయసు నుంచి నరాల సంబంధిత వ్యాధితో పోరాడుతున్న సైని తొమ్మిదేళ్ల ప్రాయంలో గోల్ఫ్ ఆడటం ప్రారంభించాడు. ఆసియా పసిఫిక్ వరల్డ్ గేమ్స్లో రెండు స్వర్ణాలు గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత గోల్ఫర్గా చరిత్ర సృష్టించిన విషయం విదితమే. అప్పటి నుంచి అతని పేరు వెలుగులోకి వచ్చింది. కాగా, తాజాగా ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచి భారత్ సత్తా చాటాడు.

Advertisement
Advertisement