ఐసీసీ దగ్గర ఇండో-పాక్ క్రికెట్ పంచాయితీ | Sakshi
Sakshi News home page

ఐసీసీ దగ్గర ఇండో-పాక్ క్రికెట్ పంచాయితీ

Published Tue, Feb 9 2016 1:28 AM

ఐసీసీ దగ్గర ఇండో-పాక్ క్రికెట్ పంచాయితీ

తమతో ద్వైపాక్షిక సిరీస్ ఆడాలనే ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని, దీనివల్ల తమకు కోట్లాది రూపాయల నష్టం వచ్చిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి తెలిపింది.

సభ్య దేశాలు ఒప్పందాలకు కట్టుబడి ఉండేలా చూడాలని, భారత్‌తో సిరీస్ విషయంలో తమకు న్యాయం చేయాలని పాక్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ ఐసీసీకి విన్నవించారు. భారత్‌లో ఐసీసీ ఈవెంట్లలో ఆడేందుకు పాక్ జట్లకు అనుమతి ఇస్తున్నప్పుడు ద్వైపాక్షిక సిరీస్‌లు ఎందుకు ఆడకూడదని ఆయన ప్రశ్నించారు.

Advertisement
Advertisement