అంతా బాగుంటే... ఆఖర్లో ఐపీఎల్‌: నెహ్రా

9 Apr, 2020 05:54 IST|Sakshi
ఆశిష్‌ నెహ్రా

న్యూఢిల్లీ: ఈ అక్టోబర్‌ కల్లా కోవిడ్‌–19 అదుపులోకి వస్తే ఐపీఎల్‌ 13వ సీజన్‌కు ఏ ఢోకా ఉండదని భారత మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా అన్నాడు. ఓ స్పోర్ట్స్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాజీ సీమర్‌ మాట్లాడుతూ ‘ఒకవేళ ఆగస్టులో నిర్వహించాలనుకున్నా... వర్షాకాలం వల్ల అది సాధ్యపడదు. చాలా మ్యాచ్‌లు వర్షార్పణమవుతాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు అక్టోబర్‌కల్లా చక్కబడితే ఐపీఎల్‌ ఈ ఏడాదే జరిగేందుకు వందశాతం అవకాశముంటుంది’ అని అన్నాడు.

భారత్‌లోనూ వైరస్‌ విస్తరిస్తుండటంతో ఈనెల 15 తర్వాత కూడా లీగ్‌ జరిగే పరిస్థితి లేదు. ఇప్పటికీ వేచిచూసే ధోరణిలోనే ఉన్న బీసీసీఐ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల యువరాజ్‌ తన కెరీర్‌లో సారథిగా గంగూలీ ఇచ్చినంత సహకారం ఎవరు ఇవ్వలేదన్నాడు. దీనిపై స్పందించిన నెహ్రా.... ధోని సారథ్యంలోనూ యువీ చక్కగా రాణించాడని, 2007 టి20 ప్రపంచకప్‌లో... ఆ తర్వాత 2011 వన్డే ప్రపంచకప్‌లో ధోని అండదండలతో చెలరేగాడని గుర్తుచేశాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా