'ఐపీఎల్ తో ఆటగాళ్లు అలసిపోతున్నారు' | Sakshi
Sakshi News home page

'ఐపీఎల్ తో ఆటగాళ్లు అలసిపోతున్నారు'

Published Fri, Jul 1 2016 6:26 PM

'ఐపీఎల్ తో ఆటగాళ్లు అలసిపోతున్నారు'

సిడ్నీ: ఇప్పటికే  మూడు ఫార్మాట్ల క్రికెట్తో సతమవుతున్న క్రికెటర్లు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వంటి టోర్నీలతో మరిన్ని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ అభిప్రాయపడ్డాడు. ఈ తరహా టోర్నమెంట్ల వల్ల ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా అలసిపోతున్నారన్నాడు.  దీంతో అంతర్జాతీయ సిరీస్లకు ఆటగాళ్ల ఎంపిక  కష్ట సాధ్యంగా మారుతుందని లీమన్ పేర్కొన్నాడు. తద్వారా వారి కెరీర్ కూడా ప్రశ్నార్ధకంగా మారే అవకాశం ఉందన్నాడు.

 

' ఐపీఎల్ వంటి టోర్నీలలో ఆటగాళ్లు పాల్గొని గాయాల బారిన పడుతున్నారు. ఆయా ఫ్రాంచైజీలతో కాంట్రాక్టు చేసుకుని టోర్నీలతో బిజీగా గడుపుతున్నారు. ఆటగాళ్లు కాంట్రాక్టులతో జాతీయ సెలక్టర్లకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అంతర్జాతీయ షెడ్యూల్ బిజీగా లేనప్పుడు ఈ టోర్నీలను నిర్వహిస్తే బాగుంటుంది.  ఈ తరహా విధానంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మార్పులు తీసుకువస్తుందని ఆశిస్తున్నా'అని లీమన్ తెలిపాడు.

 

వచ్చే సెప్టెంబర్లో మినీ ఐపీఎల్ నిర్వహించడానికి రంగం సిద్ధం చేసిన తరుణంలో లీమన్ స్పందించాడు. ఆ టోర్నీకి వేరే సమయాన్ని కేటాయిస్తే బాగుంటుందని ఐసీసీకి సూచించాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్లో తమ దేశ ఆటగాళ్లు ఎక్కువగా గాయపడిన సంగతిని ఈ సందర్భంగా లీమన్ ప్రస్తావించాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement