గెలుపు కిక్‌ కోసం హైదరాబాద్‌ ఎఫ్‌సీ | Sakshi
Sakshi News home page

గెలుపు కిక్‌ కోసం హైదరాబాద్‌ ఎఫ్‌సీ

Published Sat, Nov 2 2019 10:13 AM

ISL:Hyderabad FC To Face Kerala Blasters - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లీగ్‌లో కొత్త జట్టు... గాయాల బెడద... ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమే... చేసిన గోల్స్‌ కన్నా సమరి్పంచుకున్న వే ఎక్కువ... అయినా హైదరాబాద్‌ ఎఫ్‌సీ ఆత్మవిశ్వాసంతో ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) బరిలో దిగనుంది. సొంత ప్రేక్షకుల మధ్య తొలి విజయాన్ని సాధించి కొత్త ఉత్సాహాన్ని సాధించాలని చూస్తోంది. అదే లక్ష్యంతో నేడు గచి్చ»ౌలి స్టేడియంలో కేరళ బ్లాస్టర్స్‌ ఎఫ్‌సీతో తలపడేందుకు హైదరాబాద్‌ సిద్ధమైంది.  

గాయాలతో సతమతం...

ఫుట్‌బాల్‌ చరిత్రలో హైదరాబాద్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అయితే అది గతం. ప్రస్తుతం పూర్వవైభవం సాధించాలని తపిస్తున్న హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌కు ఐఎస్‌ఎల్‌లో భాగంగా నేడు నగరంలో జరుగనున్న మ్యాచ్‌ కీలకం కానుంది. ఇందులో ఎలాగైనా గెలుపొందడమే లక్ష్యంగా హైదరాబాద్‌ ఎఫ్‌సీ బరిలో దిగనుంది. కానీ కీలక ఆటగాళ్ల గాయాలు జట్టును కలవరపరుస్తున్నాయి. తుది పదకొండు మందిని ప్రకటించడమే కోచ్‌ ఫిల్‌ బ్రౌన్‌కు కష్టంగా మారింది. టోరీ్నలో గత రెండు మ్యాచ్‌ల్లో ఓటములతో జట్టు డీలా పడింది. అట్లెటికో డి కోల్‌కతా జట్టు చేతిలో 0–5తో, జంషెడ్‌పూర్‌ చేతిలో 1–3తో ఓడిపోయిన హైదరాబాద్‌కు సొంత మైదానంలో వచ్చే తొలి విజయం మాంచి కిక్‌ ఇస్తుందనడంలో సందేహం లేదు. కానీ హైదరాబాద్‌ డిఫెన్స్‌ బలహీనంగా ఉంది. దీనికి తోడు టోరీ్నలో ఇప్పటివరకు గోల్‌ నమోదు చేసిన అటాకర్‌ మార్సెలో పెరీరా, మరో కీలక ఆటగాడు రాబిన్‌ సింగ్‌ తమ స్థాయి ప్రదర్శన ఇంకా కనబరచలేదు. వీరే కాకుండా బోబో, గిల్స్‌ బర్న్స్, నెస్టర్‌ బెనిటెజ్, రాఫెల్‌ లోపెజ్, సాహిల్‌ పన్వర్‌ కూడా గాయాలతో జట్టుకు దూరమయ్యారు. ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేసిన జట్టు కోచ్‌ ఫిల్‌ బ్రౌన్‌.. కీలక ఆటగాళ్లు అందుబాటులో లేనప్పటికీ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నానని అన్నారు. సొంత ప్రేక్షకుల మధ్య ఒక గెలుపు లభిస్తే అది మిగతా మ్యాచ్‌ల్లో మరింత బాగా ఆడేందుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని చెప్పారు.
 
ఓటమి నుంచి బయటపడేందుకు...

మరోవైపు గత మ్యాచ్‌లో ముంబై ఎఫ్‌సీ చేతిలో ఎదురైన ఓటమి నుంచి బయటపడేందుకు కేరళ బ్లాస్టర్స్‌ ఈ మ్యాచ్‌ను వినియోగించుకోనుంది. లీగ్‌లో తొలిసారి అరంగేట్రం చేసిన హైదరాబాద్‌ను సొంతగడ్డపై ఓడించి మళ్లీ గెలుపుబాట పట్టాలని ఆ జట్టు ఉవ్విళ్లూరుతోంది. కెపె్టన్‌ బర్తోలోమెవ్‌ ఒబెబ్‌ జట్టుకు కీలకం కానున్నాడు. డిఫెన్స్‌ విభాగం కూడా మెరుగవ్వడం పట్ల హెడ్‌ కోచ్‌ ఎల్కో స్కాటెరీ హర్షం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో కీలక ఆటగాళ్లు లేని హైదరాబాద్‌ జట్టును ఎదుర్కొనేందుకు కేరళ సిద్ధమైంది.  
జట్లు (అంచనా)

కేరళ బ్లాస్టర్స్‌ ఎఫ్‌సీ: బిలాల్‌ హుస్సేన్‌ ఖాన్‌ (గోల్‌కీపర్‌), మొహమ్మద్‌ రాకిప్, జైరో రోడ్రిగ్స్, జియాని జువెర్లోన్, జింగ్, జెస్సెల్‌ కారి్నరో, నర్జారీ, సెర్గియో సిడోంచా, జెకెన్‌ సింగ్, సహల్‌ సమద్, బర్తోలోమెవ్‌.  
హైదరాబాద్‌ ఎఫ్‌సీ: కమల్‌జిత్‌ సింగ్‌ (గోల్‌ కీపర్‌), ఆశిష్‌ రాయ్, మాథ్యూ కిల్గాలాన్, గుర్జీత్‌ సింగ్, యాసిర్, నిఖిల్‌ పుజారి, మార్కో స్టాంకోవిక్, ఆదిల్‌ ఖాన్, రోహిత్‌ కుమార్, మార్సెలో పెరీరా, రాబిన్‌ సింగ్‌.  

‘ఈవెంట్స్‌నౌ’లో టికెట్లు...

హైదరాబాద్‌ ఎఫ్‌సీ, కేరళ బ్లాస్టర్స్‌ మ్యాచ్‌కు సంబంధించి టికెట్లు eventsnow.comలో లభిస్తున్నాయి. టికెట్ల ధరలను వరుసగా రూ. 100, రూ. 300, రూ. 500, రూ. 1000, రూ. 1500లుగా నిర్ణయించారు.

Advertisement
Advertisement