జూహియాకు స్వర్ణం | Sakshi
Sakshi News home page

జూహియాకు స్వర్ణం

Published Thu, Sep 22 2016 11:20 AM

juhia gets gold medal in sgf games

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ సమాఖ్య (ఎస్‌జీఎఫ్) పోటీల్లో హైదరాబాద్ బాక్సర్ జూహియా అఫ్రీన్ బంగారు పతకం సాధించింది. తద్వారా జాతీయ స్కూల్ గేమ్స్‌లో పాల్గొనే తెలంగాణ జట్టుకు ఎంపికైంది. వరంగల్‌లో బుధవారం జరిగిన బాలికల 60-63 కేజీల కేటగిరీలో ఆమె విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆమె తన ప్రత్యర్థిని కేవలం 20 సెకన్లలోనే కంగుతినిపించింది. ఎన్‌ఏఎస్‌ఆర్ స్కూల్ విద్యార్థి అయిన జూహియా ఎల్బీ స్టేడియంలో కోచ్ ఓంకార్‌నాథ్ యాదవ్ దగ్గర శిక్షణ తీసుకుంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement