ఆ గౌరవం కపిల్దేవ్కే! | Sakshi
Sakshi News home page

ఆ గౌరవం కపిల్దేవ్కే!

Published Tue, Sep 27 2016 11:54 AM

ఆ గౌరవం కపిల్దేవ్కే!

కోల్కతా: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం తరహాలో భారత్లోని ఈడెన్ గార్డెన్లో  అమర్చిన గంటను ముందుగా కొట్టబోయే గౌరవం మాజీ దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ దక్కనుంది. ఈ మేరకు కపిల్ దేవ్ కు ఆహ్వానం పంపినట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) స్పష్టం చేసింది. న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్లో భాగంగా నగరంలోని ఈడెన్లో జరుగనున్న రెండో టెస్టును గంటను కొట్టిన తరువాత ఆరంభించనున్నట్లు క్యాబ్ జాయింట్ సెక్రటరీ అవిషేక్ దాల్మియా తెలిపారు. 'ఇలా కపిల్ దేవ్ తో  గంటను కొట్టించాలనేది క్యాబ్ అధ్యక్షుడు గంగూలీ ఆలోచన. ఈ విషయాన్ని తెలుపుతూ కపిల్ కు ఆహ్వానం కూడా పంపాం. అందుకు ఆయన అంగీకరించారు' అని అవిషేక్ పేర్కొన్నారు.

 ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో గంట కొట్టిన తరువాత టెస్టు మ్యాచ్ను ప్రారంభించడం ఆనవాయితీ. ఈ మైదానంలో టెస్టు మ్యాచ్ జరిగనన్నీ రోజులూ రెండు దేశాలకు చెందిన క్రికెట్ లెజెండ్స్ గంట కొట్టి మ్యాచ్ను ఆరంభిస్తారు. ఇందుకు  పెవిలియన్ కు వెలుపల ఉండే బౌలర్ల బార్లో గంట వేలాడదీసి ఉంటుంది.  అయితే ఈ తరహా పద్ధతిపై భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఆసక్తి కనబరచడంతో గత కొన్నేళ్లుగా చేసిన ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పడనుంది. న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య రెండో్ టెస్టు ఈ నెల 30వ తేదీన ఆరంభం కానుంది.
 

Advertisement
Advertisement