ఏడు మెయిడిన్లు..ఆరు వికెట్లు | Sakshi
Sakshi News home page

ఏడు మెయిడిన్లు..ఆరు వికెట్లు

Published Sat, Mar 18 2017 4:23 PM

ఏడు మెయిడిన్లు..ఆరు వికెట్లు

వెల్లింగ్టన్:న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ విజృంభించాడు.  తన కెరీర్ లో కేవలం ఆరో టెస్టు మ్యాచ్ మాత్రమే ఆడుతున్న మహరాజ్ ఆరు వికెట్లు సాధించి తొలిసారి అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. మహరాజ్ దెబ్బకు శనివారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన న్యూజిలాండ్ కకావికలమైంది. మహరాజ్ స్పిన్ కు దాసోహమైన కివీస్ తన రెండో ఇన్నింగ్స్ లో 171 పరుగులకు ఆలౌటైంది   20.2 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన మహరాజ్ అటు వికెట్లతో పాటు మెయిడిన్ ఓవర్లు కూడా వేసి  తన స్పిన్ మ్యాజిక్ ను చూపెట్టాడు.

అంతకుముందు 349/9 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 359 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ ను మహరాజ్ కకావికలం చేశాడు. న్యూజిలాండ్ ను ఏ దశలోనూ కోలుకోనీయకుండా చేసి చావుదెబ్బ కొట్టాడు.అతనికి జతగా మోర్నీ మోర్కెల్ మూడు వికెట్లతో రాణించాడు.

న్యూజిలాండ్ ఓపెనర్ రావల్(80) ఒక్కడే హాఫ్ సెంచరీతో మెరిశాడు. దాంతో 81 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే న్యూజిలాండ్ నిర్దేశించకల్గింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.  స్టీఫెన్ కుక్(11), ఎల్గర్(17)లు పెవిలియన్ చేరగా, హషీమ్ ఆమ్లా(38 నాటౌట్), డుమినీ(15 నాటౌట్) లు విజయాన్ని అందించారు. మూడు టెస్టుల సిరీస్ లో దక్షిణాఫ్రికాకు 1-0 ఆధిక్యం లభించింది.


 

Advertisement
Advertisement