అథ్లెటిక్స్ పోటీలు షురూ | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్ పోటీలు షురూ

Published Tue, Jan 17 2017 10:47 AM

అథ్లెటిక్స్ పోటీలు షురూ

హైదరాబాద్: ‘ఖేలో ఇండియా’ అథ్లెటిక్స్ పోటీలు సోమవారం గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రారంభమయ్యాయి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) మేనేజింగ్ డెరైక్టర్ ఎ. దినకర్ బాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అంతర్జాతీయ పోటీల్లో రాణించిన వారికి భారీ ప్రోత్సాహకాలు అందిస్తున్నారని తెలిపారు. ప్రతిభావంతులను సానబెట్టేందుకు... వారు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు గెలిచేందుకు ‘శాట్స్’ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ చాంపియన్‌షిప్‌లో 31 జిల్లాలకు చెందిన 1200 మంది క్రీడాకారులు, పీఈటీలు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి, శాట్స్ డిప్యూటీ డెరైక్టర్ కె. మనోహర్, వాటర్ స్పోర్‌‌ట్స అడ్మినిస్ట్రేటర్ ఎల్. హరినాథ్, జిల్లా స్పోర్‌‌ట్స అథారిటీ అధికారి ఎన్. సుధాకర్‌రావు, పలువురు క్రీడాకారులు, పీఈటీలు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement