సన్ రైజర్స్ బ్యాటింగ్ | Sakshi
Sakshi News home page

సన్ రైజర్స్ బ్యాటింగ్

Published Fri, Apr 28 2017 7:49 PM

kings punjab won the toss and elected to field first

మొహాలి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా శుక్రవారం రాత్రి ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ కెప్టెన్ మ్యాక్స్ వెల్ తొలుత హైదరాబాద్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఇరు జట్ల మధ్య జరిగిన గత లీగ్ మ్యాచ్ లో హైదరబాద్ గెలిచిన సంగతి తెలిసిందే. దాంతో లెక్క సరిచేయాలని కింగ్స్ పంజాబ్ భావిస్తోంది. మరొకవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పరాయి గడ్డపై గెలుపే లక్ష్యంగా  బరిలోకి దిగుతుంది. ఇప్పటివరకూ 'బయట' బోణి కొట్టని సన్ రైజర్స్ విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది.


సన్ రైజర్స్ తుది జట్టు; డేవిడ్ వార్నర్(కెప్టెన్), శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్, హెన్రిక్స్, యువరాజ్ సింగ్, దీపక్ హుడా, నమాన్ ఓజా, భువనేశ్వర్ కుమర్,ఆశిష్ నెహ్రా, సిద్ధార్ధ కౌల్, రషిద్ ఖాన్

కింగ్స్ పంజాబ్ తుది జట్టు; మ్యాక్స్ వెల్(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, వోహ్రా, షాన్ మార్ష్, ఇయాన్ మోర్గాన్, సాహా, అక్షర్ పటేల్, మోహిత్ శర్మ, అనురీత్ సింగ్, ఇషాంత్ శర్మ,కేసీ కరియప్ప
 

Advertisement
Advertisement