ఐపీఎల్‌: ట్రెండ్‌ మార్చిన అశ్విన్‌ | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌: ట్రెండ్‌ మార్చిన అశ్విన్‌

Published Thu, Apr 19 2018 7:44 PM

Kings Punjab won the toss and elected to bat first - Sakshi

మొహాలీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా గురువారం ఇక్కడ పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఐఎస్‌ బింద్రా స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ తీసుకుంది. టాస్‌ గెలిచిన ​కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ముందుగా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. అయితే ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకూ టాస్‌ గెలిచిన జట్లు తొలుత ఫీల్డింగ్‌ తీసుకుంటే, అశ్విన్‌ మాత్రం బ్యాటింగ్‌ తీసుకుని ట్రెండ్‌ను మార్చడం విశేషం.

ఇప్పటివరకూ కింగ్స్‌ పంజాబ్‌ రెండు మ్యాచ్‌లు గెలిస్తే, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ విజయాల్ని నమోదు చేసింది. ఈ క‍్రమంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్‌ మరో గెలుపుపై కన్నేసింది. అయితే కింగ్స్‌ పంజాబ్‌ సాధించిన రెండు విజయాలు సొంత మైదానంలో రావడంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఇరు జట్లు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో పటిష్టంగా ఉండటంతో ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, సన్‌రైజర్స్‌ మాత్రం ఒక మార్పు చేసింది. స్టాన్‌ లేక్‌ స్థానంలో క్రిస్‌ జోర్డాన్‌ను తుది జట్టులోకి తీసుకుంది.

తుది జట్లు

కింగ్ప్‌ పంజాబ్‌

అశ్విన్‌(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌ గేల్‌, మయాంక్‌ అగర్వాల్‌, యువరాజ్‌ సింగ్‌, అరోన్‌ ఫించ్‌, కరుణ నాయర్‌, ఆండ్రూ టై, బరిందర్‌ శ్రాన్‌, మోహిత్‌ శర్మ, ముజిబ్‌ ఉర్‌ రెహ్మాన్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), వృద్ధిమాన్‌ సాహా, శిఖర్‌ ధావన్‌, మనీష్‌ పాండే, షకిబుల్‌ హసన్‌, దీపక్‌ హుడా, యూసఫ్‌ పఠాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, రషీద్‌ ఖాన్‌, సిద్దార్ధ్‌ కౌల్‌, క్రిస్‌ జోర్డాన్‌

Advertisement
Advertisement