ఆఖరి మ్యాచ్‌లోనూ అదుర్స్ | Sakshi
Sakshi News home page

ఆఖరి మ్యాచ్‌లోనూ అదుర్స్

Published Mon, May 26 2014 1:01 AM

ఆఖరి మ్యాచ్‌లోనూ అదుర్స్

 పంజాబ్‌కు 11వ విజయం
 రాణించిన మిల్లర్, వోహ్రా
 పీటర్సన్ శ్రమ వృథా
 ఢిల్లీకి తప్పని మరో ఓటమి
 
 మొహాలీ: ఇప్పటికే ప్లే ఆఫ్‌కు అర్హత సాధించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను చిత్తు చేసి విజయంతో లీగ్ దశను ముగించింది. దీంతో కీలకమైన నాకౌట్‌కు ముందు జట్టులో మరింత ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకుంది. ఐపీఎల్-7లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై నెగ్గింది.
 
  పీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 18.1 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. పీటర్సన్ (41 బంతుల్లో 58; 9 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. దినేశ్ కార్తీక్ (13), నీషమ్ (12) మినహా మిగతా బ్యాట్స్‌మన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కార్తీక్, పీటర్సన్ రెండో వికెట్‌కు 31 పరుగులు జోడించడంతో పవర్ ప్లేలో ఢిల్లీ 3 వికెట్లకు 44 పరుగులు చేసింది. తర్వాతి వరుస బ్యాట్స్‌మన్ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఫలితంగా ఢిల్లీ 24 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లు చేజార్చుకుంది.
 
 అవానా, పటేల్, జాన్సన్, కరణ్‌వీర్ తలా రెండు వికెట్లు తీశారు.
 తర్వాత పంజాబ్ 13.5 ఓవర్లలో 3 వికెట్లకు 119 పరుగులు చేసి గెలిచింది. వోహ్రా (38 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మిల్లర్ (34 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగారు. సెహ్వాగ్ (9) విఫలమయ్యాడు. 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ను వోహ్రా, మిల్లర్ మూడో వికెట్‌కు 96 పరుగులు జోడించి విజయపథంలో నిలబెట్టారు. షమీ, ఉనాద్కట్, తాహిర్ తలా ఓ వికెట్ పడగొట్టారు. వోహ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
 
 స్కోరు వివరాలు
 ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: పీటర్సన్ ఎల్బీడబ్ల్యు (బి) ధావన్ 58; అగర్వాల్ (సి) సెహ్వాగ్ (బి) జాన్సన్ 2; కార్తీక్ (సి) పటేల్ (బి) అవానా 13; జాదవ్ (సి) వోహ్రా (బి) అవానా 0; తివారీ రనౌట్ 8; డుమిని (సి) పటేల్ (బి) కరణ్‌వీర్ 8; నీషమ్ (సి) బెయిలీ (బి) కరణ్‌వీర్ 12; నదీమ్ నాటౌట్ 3; షమీ (బి) పటేల్ 0; తాహిర్ (సి) ధావన్ (బి) పటేల్ 4; ఉనాద్కట్ (సి) మాక్స్‌వెల్ (బి) జాన్సన్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (18.1 ఓవర్లలో ఆలౌట్) 115.
 
 వికెట్ల పతనం: 1-13; 2-44; 3-44; 4-67; 5-91; 6-93; 7-110; 8-111; 9-115; 10-115
 బౌలింగ్: అవానా 3-1-15-2; అక్షర్ పటేల్ 4-0-28-2; జాన్సన్ 3.1-0-27-2; కరణ్‌వీర్ 4-0-22-2; రిషీ ధావన్ 4-0-22-1.
 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) కార్తీక్ (బి) షమీ 9; వోహ్రా (బి) తాహిర్ 47; మాక్స్‌వెల్ (సి) పీటర్సన్ (బి) ఉనాద్కట్ 0; మిల్లర్ నాటౌట్ 47; బెయిలీ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం: (13.5 ఓవర్లలో 3 వికెట్లకు) 119.
 
 వికెట్ల పతనం: 1-13; 2-16; 3-112
 బౌలింగ్: షమీ 3-0-26-1; ఉనాద్కట్ 2-0-3-1; నీషమ్ 1-0-14-0; డుమిని 2-0-15-0; తాహిర్ 3.5-0-32-1; నదీమ్ 2-0-24-0.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement