ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ

Published Sun, Apr 8 2018 6:36 PM

KL Rahul Scores Fastest IPL Half Century - Sakshi

మొహాలీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ఫాస్టెస్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు నమోదైంది.  ఆదివారం ఢిల్లీ  డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ వేగవంతమైన అర్థ శతకాన్ని నమోదు చేశాడు. 14 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చెలరేగి ఆడి సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఢిల్లీ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కింగ్స్‌ ఓపెనర్ రాహుల్‌ ఆది నుంచి దూకుడుగా ఆడాడు. క్రీజ్‌లోకి వచ్చీ రావడంతోనే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడిన రాహుల్‌ బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ నమోదు చేసి ఇప్పటివరకూ యూసఫ్‌ పఠాన్‌, సునీల్‌ నరైన్‌  పేరిట సంయుక్తంగా ఉన్న 15 బంతుల ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ రికార్డును బద్ధలు కొట్టాడు.

2014లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో యూసఫ్‌ పఠాన్‌ ఈ ఫీట్‌ సాధించగా, 2017లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో నరైన్‌.. పఠాన్‌ సరసన చేరాడు. దాన్ని తాజాగా రాహుల్‌ సవరించి కొత్త మైలురాయిని సాధించాడు. అయితే రాహుల్‌ (51;16 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) దాటిగా ఆడే క్రమంలో రెండో వికెట్‌గా ఔటయ్యాడు.

Advertisement
Advertisement