కుంబ్లేపై ట్వీట్లు డిలీట్ చేసిన కోహ్లీ | Sakshi
Sakshi News home page

కుంబ్లేపై ట్వీట్లు డిలీట్ చేసిన కోహ్లీ

Published Thu, Jun 22 2017 9:21 PM

కుంబ్లేపై ట్వీట్లు డిలీట్ చేసిన కోహ్లీ

న్యూఢిల్లీ: భారత్ క్రికెట్‌టీం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, కోచ్‌ మద్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఇందుకు ఓ సంఘటన అద్దం పడుతోంది. గతంలో కోచ్‌గా అనిల్‌ కుంబ్లేని నియమాన్ని ఆహ్వానిస్తూ విరాట్‌ ట్విట్టర్‌లో ట్వీట్‌చేశాడు. అయితే ఇప్పుడు ఆట్వీట్లను కోహ్లీ తన ట్విట్టర్‌ అకౌంట్‌ నుంచి డిలీట్‌ చేశాడు. ఇప్పుడు ఆట్వీట్లు ట్టిట్టర్‌లో కనిపించడంలేదు. పక్కన ఉన్న ఫొటోలో కోహ్లీ చేసిన ట్వీట్లు లేవు అని చూపిస్తుంది. 2016 జూన్‌ 23న ​భారత్‌ క్రికెట్‌ చీఫ్‌ కోచ్‌గా అనిల్‌ కుంబ్లే ఎంపికయ్యాడు. ఆసమయంలో విరాట్‌ కుంబ్లేకు శుభాకాంక్షలు తెలుపుతూ 'కోచ్‌గా ఎంపికైనందుకు కుంబ్లే సార్‌కు శుభాకాంక్షలు, మీసారధ్యంలో జట్టు ముందుకు సాగుతుంది' అని అదే రోజు ట్వీట్‌ చేశాడు.

పదవినుంచి దిగిపోయిన కొద్ది గంటల తర్వాత కుంబ్లే కోహ్లీ కారణంగానే కోచ్‌పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 'నేను ఎప్పుడు కెప్టెన్‌, కోచ్‌ పాత్రలను గౌరవిస్తాను. కోచ్‌, కెప్టెన్‌ల మధ్య ఉన్న అపార్థాలను తొలగించడానికి బీసీపీఐ చాలా ప్రయత్నించింది. కానీ అది సఫలం కాలేదు. కోచ్‌, కెప్టెన్‌ మధ్య అవగాహన ముఖ్యం. అది మా మధ్యలోపించింది అందుకే పదవి నుంచి వైదొలగడం మంచిదని భావించాను' అంటూ కుంబ్లే తెలిపాడు.

చాంపియన్‌ట్రోఫీ అనంతరం వెస్టిండీస్‌ పర్యటనకు కోచ్‌గా కుంబ్లే కొనసాగుతాడని బీసీసీఐ ప్రకటించింది. అయతే ఆకస్మికంగా కోచ్‌ పదవి బాద్యతలనుంచి వైదలగుతున్నానంటూ కుంబ్లే ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement