వన్డేల్లో రెండో ర్యాంక్ లో నిలిచిన కోహ్లి | Sakshi
Sakshi News home page

వన్డేల్లో రెండో ర్యాంక్ లో నిలిచిన కోహ్లి

Published Mon, Nov 17 2014 8:21 PM

Kohli jumps to 2nd in ODI rankings after ton against Lanka

దుబాయ్: టీమిండియా బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లి వన్డేల్లో రెండో ర్యాంక్ కు చేరుకున్నాడు. శ్రీలంకతో ముగిసిన ఐదు వన్డేల సిరీస్ లో రాణించడంతో ఒక ర్యాంకు మెరుగుపరుచుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో నిలిచాడు.

వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుతో ప్రపంచరికార్డు సృష్టించిన రోహిత్ శర్మ 15వ స్థానానికి ఎగబాకాడు. అతడు18 స్థానాలు మెరుగుపరుచుకోవడం విశేషం. శిఖర్ ధావన్ 5, మహేంద్ర సింగ్ ధోని 7 ర్యాంకుల్లో ఉన్నారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ డీవిలియర్స్ టాప్ లో కొనసాగుతున్నాడు.

బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ 8, రవీంద్ర జడేజా 10వ స్థానాల్లో నిలిచారు. అశ్విన్ 15వ ర్యాంకులో ఉన్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement