టాప్‌-10లో విరాట్‌ కోహ్లి | Sakshi
Sakshi News home page

టాప్‌-10లో విరాట్‌ కోహ్లి

Published Tue, Jul 17 2018 7:30 PM

Kohli placed in Top 10 for Most Fifty Plus Scores - Sakshi

లీడ్స్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన క్లబ్‌లో చేరిపోయాడు. వన్డేల్లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు సాధించిన జాబితాలో కోహ్లి పదో స్థానాన్ని ఆక్రమించాడు. ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో కోహ్లి హాఫ్‌ సెంచరీ సాధించాడు. 56 బంతుల్లో అర్థ శతకం​ నమోదు చేసిన కోహ్లి.. వన్డేల్లో యాభైకి పైగా పరుగుల్ని 83 సార్లు సాధించాడు. ఫలితంగా టాప్‌-10లో కోహ్లి నిలిచాడు. ఈ క‍్రమంలోనే వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు బ్రియాన్‌ లారా(82) రికార్డును కోహ్లి బ‍్రేక్‌ చేశాడు. కోహ్లి సాధించిన 83 అత్యధిక యాభైకి పైగా స్కోర‍్లలో 35 సెంచరీలు ఉండగా, 48 హాఫ్‌ సెంచరీలున్నాయి.

ఈ జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ (145) తొలి స్థానంలో ఉండగా, సంగక్కార(118) రెండో స్థానంలో ఉన్నాడు. ఆపై రికీ పాంటింగ్‌(112), కల్లిస్‌(103), మహేల జయవర్ధనే(96), జయసూర్య(96), రాహుల్‌ ద్రవిడ్‌(95), సౌరవ్‌ గంగూలీ(94), ఇంజమాముల్‌ హక్‌(93)లు ఉన్నారు.  ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో కోహ్లి(71; 72 బంతుల్లో 8 ఫోర్లు) నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

Advertisement
Advertisement