పాక్‌పై లంకకు ఆధిక్యం | Sakshi
Sakshi News home page

పాక్‌పై లంకకు ఆధిక్యం

Published Sat, Jun 27 2015 2:00 AM

Lanka lead the Pak

కొలంబో : పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక నిలకడగా ఆడుతోంది. జేకే సిల్వ (218 బంతుల్లో 80; 10 ఫోర్లు), కెప్టెన్ మ్యాథ్యూస్ (153 బంతుల్లో 77; 8 ఫోర్లు) రాణించడంతో శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 118.2 ఓవర్లలో 9 వికెట్లకు 304 పరుగులు చేసింది. ప్రస్తుతం లంక 166 పరుగుల ఆధిక్యంలో ఉంది. యాసిర్ షా 5 వికెట్లు తీశాడు.

Advertisement
Advertisement