సన్నీకి జీవిత సాఫల్య పురస్కారం | Sakshi
Sakshi News home page

సన్నీకి జీవిత సాఫల్య పురస్కారం

Published Fri, Oct 21 2016 6:39 PM

సన్నీకి జీవిత సాఫల్య పురస్కారం

ముంబై: క్రికెట్ లెజెండ్ సునీల్ మనోహర్ గవాస్కర్ కి  జీవిత సాఫల్య పురస్కారం అందించనున్నట్లు ముంబై జర్నలిస్టు క్రీడల సంఘం(ఎస్ జేఏఎమ్) ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 11న ఎస్ జేఏఎమ్ గోల్డెన్ జూబ్లీ వేడుకల పురస్కారానికి సునీల్ ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్-ఇంగ్లాండ్ ల మధ్య జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్ చివరి రోజున వాంఖడే స్టేడియంలో సన్నీకు పురస్కారాన్ని ప్రధానం చేయనున్నట్లు చెప్పింది.

2013 సెప్టెంబర్ లో బాడ్మింటన్ లెజెండ్ నందూ నటేకర్ కు జీవిత సాఫల్య పురస్కారాన్ని మొదటిసారి ఎస్ జేఏఎమ్  ప్రధానం చేసింది. గవాస్కర్ కు భారత క్రికెట్ తో 50ఏళ్ల అనుబంధం ఉంది. 1966లో సన్నీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ గా వజీర్ సుల్తాన్ ఎలెవన్ తరఫున బరిలోకి దిగారు. 1970లో బొంబాయి తరఫున రంజీ ట్రోఫీలో పాల్గొన్నారు. 1970-71 మధ్య వెస్టిండీస్ టూర్ కు వెళ్లిన సన్నీ సిరీస్ లో 774 పరుగులు చేశారు. టెస్టు క్రికెట్ లో 10వేల పరుగుల క్లబ్ లో చేరిన తొలి క్రికెటర్ సునీల్ గవాస్కర్.

1983 వరల్డ్ కప్ సాధించిన టీమ్ లో సన్నీ కూడా ఉన్నారు. కెరీర్ లో 125 టెస్టు మ్యాచ్ లు ఆడిన సన్నీ 34 సెంచరీలతో 10,122 పరుగులు చేశారు. 108 వన్డే మ్యాచ్ ల్లో 3 వేల పరుగులు సాధించారు. 1987లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. అప్పటినుంచి బీసీసీఐ టెక్నికల్ కమిటీ, ఐసీసీ క్రికెట్ కమిటీలకు చైర్మన్ గాను, ఐసీసీ మ్యాచ్ రిఫరీగాను, ముంబై క్రికెట్ సంఘానికి చైర్మన్ గాను, క్రికెట్ ఇంప్రూవ్ మెంట్ కమిటీలోనూ, భారత క్రికెట్ టీమ్ కు బ్యాటింగ్ కోచ్ గాను సేవలందించారు. 2014లో భారత్, యూఏఈల్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లకు బీసీసీఐ ప్రెసిడెంట్ గా సుప్రీంకోర్టు సన్నీని నామినేట్ చేసింది.

Advertisement
Advertisement