'ఇన్నాళ్లకు సాధారణ స్థితికి వచ్చా' | Sakshi
Sakshi News home page

'ఇన్నాళ్లకు సాధారణ స్థితికి వచ్చా'

Published Thu, Apr 21 2016 9:21 PM

'ఇన్నాళ్లకు సాధారణ స్థితికి వచ్చా'

లండన్: వరల్డ్ టీ 20లో వెస్టిండీస్తో జరిగిన తుదిపోరు చివరి ఓవర్లో ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్ ఊచకోతకు గురయ్యాడు. విండీస్ విజయానికి ఆఖరి ఓవర్ లో 19 పరుగులు కావాల్సిన తరుణంలో బెన్ స్టోక్స్ నాలుగు సిక్సర్లు సమర్పించుకుని ఇంగ్లండ్ పరాజయానికి కారణమయ్యాడు.  ఆ ఓవర్ లో విండీస్ ఆటగాడు బ్రాత్ వైట్ వరుస సిక్సర్లతో చెలరేగిపోయి తన జట్టుకు వరల్డ్ కప్ ను అందించాడు. దీంతో ఆ ఓవర్ బెన్ స్టోక్స్ పాలిట శాపంగా మారింది. అయితే అప్పుడు తగిలిన మానసిక గాయం నుంచి కోలుకోవడానికి చాలా కాలం  పట్టిందని స్టోక్స్ తాజాగా స్పష్టం చేశాడు.

'ఆ ఓవర్ నన్ను చాలా నిరుత్సాహానికి గురి చేసింది. ఇప్పడిప్పుడే ఆ చేదు జ్ఞాపకం నుంచి బయటకొస్తున్నా. ఈ వేసవిలో చాలా బిజీ షెడ్యూల్ ఉండటం నిజంగా నా అదృష్టం. అందుకే తొందరగా సాధారణ స్థితికి వచ్చా. ఇప్పడు నేను దుహ్రమ్ తరపున రెండు కౌంటీ మ్యాచ్లు ఆడాల్సి ఉంది.  ఆ తరువాత టెస్టు మ్యాచ్ ఉంది. విండీస్ తో మ్యాచ్ అనంతరం దాదాపు రెండు వారాలు పూర్తిగా నైరాశ్యంలో పడిపోయా'అని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు.

Advertisement
Advertisement